ఇంటిలోనే వ్యాక్సిన్ తీసుకున్న సింగర్ గీతా రాబరి……హెల్త్ కేర్ వర్కర్ పై చర్యలు తీసుకోనున్న అధికారులు

గుజరాత్ లో జానపద గీతాల గాయని గీతా రాబరి తన ఇంట్లోనే వ్యాక్సిన్ తీసుకున్న ఉదంతం వివాదాస్పదమైంది. కచ్ జిల్లా మాదాపూర్ గ్రామంలో ఈమెకు ఇంటిలోనే టీకా మందు ఇచ్చారు.

ఇంటిలోనే వ్యాక్సిన్ తీసుకున్న సింగర్ గీతా రాబరి......హెల్త్ కేర్ వర్కర్ పై చర్యలు తీసుకోనున్న అధికారులు
Geeta Rabari
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 14, 2021 | 1:17 PM

గుజరాత్ లో జానపద గీతాల గాయని గీతా రాబరి తన ఇంట్లోనే వ్యాక్సిన్ తీసుకున్న ఉదంతం వివాదాస్పదమైంది. కచ్ జిల్లా మాదాపూర్ గ్రామంలో ఈమెకు ఇంటిలోనే టీకా మందు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఇంకా వ్యాక్సిన్ కొరత ఉన్న నేపథ్యంలో హెల్త్ కేర్ స్టాఫ్ ఇలా ఈమె ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ ఎలా ఇస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ హెల్త్ కేర్ వర్కర్ కి షోకాజ్ నోటీసు ఇచ్చే పనిలో పడ్డారు.. ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ సందర్భంగా గీతా రాబరి తన జానపద గీతాలతో అలరించింది. ఇప్పుడు ఇంట్లో సోఫాలో కూర్చుని ఫోటో దిగిన వైనాన్ని ఆమె పోస్ట్ చేసింది. అయితే ఎవరి ఆదేశాలతో ఆ వర్కర్ ఆమె ఇంటికి వెళ్ళింది.. ఎలా వ్యాక్సిన్ ఇచ్చింది తదితర వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ ఆ వర్కర్ కి నోటీసు జారీ చేసినట్టు కచ్ జిల్లా అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా దీనికి సమాధానమివ్వాలని ఆదేశించారు. ఇటీవలే క్రికెటర్ కుల్ దీప్ యాదవ్ కూడా కాన్పూర్ లోని ఓ గెస్ట్ హౌస్ లో వ్యాక్సిన్ తీసుకున్న విషయం వివాదాస్పదమైంది. అది మరువక ముందే సింగర్ గీతా రాబరి వ్యాక్సిన్ తీసుకున్న అంశాన్ని యూజర్లు సోషల్ మీడియాలో లేవనెత్తారు. ప్రధాని మోదీ .ఇతర అగ్ర నేతలు వ్యాక్సిన్ కేంద్రాలకో ..ఆసుపత్రులకో వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటుండగా నువ్వు వర్కర్ ని ఇంటిలోనికే ఎలా రప్పించుకున్నావని వారు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇందులో తన తప్పేమీ లేదని గీత అంటోంది. మరి ఈ వివాదాన్ని అధికారులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చూడండి: బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ కి దెబ్బ….ఐదుగురు ఎంపీల ‘తిరుగుబాటు’……లోక్ సభలో తమను వేరుగా గుర్తించాలని స్పీకర్ కి లేఖ

Toyota Cars: టయోటా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.75 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.. ఈ నెల 30 వరకు అవకాశం

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్