Chirag Paswan: బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ కి ఎదురు దెబ్బ….ఐదుగురు LJP ఎంపీల తిరుగుబాటు

LJP - Chirag Paswan: బీహార్ లో లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ పై ఐదుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు.తమను లోక్ సభలో వేరుగా గర్హించాలని కోరుతూ వీరు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

Chirag Paswan: బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ కి ఎదురు దెబ్బ....ఐదుగురు LJP ఎంపీల తిరుగుబాటు
Five Ljp Mps Revolt Against
Follow us
Umakanth Rao

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 14, 2021 | 1:27 PM

బీహార్ లో లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ పై ఐదుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు.తమను లోక్ సభలో వేరుగా గర్హించాలని కోరుతూ వీరు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. చిరాగ్ కి బంధువులైన పశుపతి కుమార్ పరాస్, ప్రిన్స్ రాజ్…మరో ముగ్గురు ఎంపీలు చందన్ సింగ్, వీణా దేవి, మెహబూబ్ అలీ కైసర్ గత ఏడాది నుంచి చిరాగ్ తో విభేదిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు పార్టీ నేతలను చిరాగ్ చీట్ చేశాడని లోక్ జన శక్తి పార్టీ మాజీ నేత కేశవ్ సింగ్ లోగడ కేసు పెట్టారు. గత ఎన్నికల్లో ఈ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. (కేశవ్ సింగ్ గత ఫిబ్రవరిలో జేడీ-యూలో చేరారు). కాగా ఈ అయిదుగురు ఎంపీలు గత ఆదివారం స్పీకర్ ఓం బిర్లాను కలుసుకుని.. తమను సభలో వేరుగా గుర్తించాలని…చిరాగ్ స్థానే.. పశుపతి కుమార్ పరాస్ ను తమ పార్టీ నేతగా చేయాలనీ అభ్యర్థించారు. పైగా తమ రాష్ట్ర రాజకీయ తాజా పరిణామాలను కూడా వీరు ఈ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. వీరు కూడా బీహార్ లో పాలక జేడీ-యూలో చేరే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

అటు-చిరాగ్ పాశ్వాన్ ఇంతవరకు ఈ పరిణామాలపై ఇంకా స్పందించాల్సి ఉంది. ఇదంతా జేడీ-యూ పన్నిన పన్నాగమా అని ఆయన సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణించినప్పటి నుంచి చిరాగ్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు.. ఆయన పనితీరు పట్ల ఈ ఐదుగురు ఎంపీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి కి ఉన్న సామర్థ్యం ఈయనకు లేదని వీరు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Nithiin’s Maestro : స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. ‘మ్యాస్ట్రో’ చివరి షెడ్యూల్ కూడా మొదలు పెట్టిన టీమ్..

Fire In Dreams: కలలో అగ్ని కనిపిస్తే ఏమవుతుంది.? దేనికి సంకేతం.! మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది.!

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్