హైదరాబాద్‌లో ఆజాద్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.600 కోట్లతో ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు

ఆజాద్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.585 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో తమ రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. రాబోయే మూడేళ్లలో అందుబాటులోకి రానున్న..

Subhash Goud

|

Updated on: Jun 15, 2021 | 10:09 AM

ఆజాద్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.585 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో తమ రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. రాబోయే మూడేళ్లలో అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్‌తో కొత్తగా 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

1 / 3
ఈ ప్లాంట్‌ కోసం నిధుల సమీకరణలో భాగంగా తొలి విడుతలో డీఎంఐ మేనేజ్‌మెంట్‌ నుంచి రూ.145 కోట్లను ఈ హైదరాబాద్‌ ఆధారిత సంస్థ అందుకుంది. ఇక షామీర్‌పేట్‌లో ఏర్పాటయ్యే ఈ ప్లాంట్‌ కోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది.

2 / 3
ఎంఏఎన్‌, దూసన్‌ స్కోడా, జీఈ, మిట్సుబిషి, సీమెన్స్‌, తొషీబా, జీఈ ఏవియేషన్‌, బోయింగ్‌, హనీవెల్‌, ఈటన్‌ కార్పొరేషన్‌, రాఫెల్‌, బీహెచ్‌ఈఎల్‌, హెచ్‌ఏఎల్‌, బేకర్‌ హగీస్‌ తదితర భారీ అంతర్జాతీయ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌తో ఆజాద్‌ ప్రథమ శ్రేణి భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం గమనార్హం. దీంతో రాబోయే ఐదు సంవత్సరాలలో రూ.1,800 కోట్లకుపైగా ఆర్డర్లను ఆజాద్‌ చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

3 / 3
Follow us