AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Customer Alert: మీకు ఎస్‌బీఐ నుంచి గిఫ్ట్‌ వచ్చిందంటూ మెసేజ్‌ వచ్చిందా.. ? అయితే ఇలా చేయండి..!

SBI Customer Alert: మీకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి గిఫ్ట్ వచ్చిందంటూ మెసేజ్‌ వచ్చిందా..? అయితే జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. లేకపోతే..

SBI Customer Alert: మీకు ఎస్‌బీఐ నుంచి గిఫ్ట్‌ వచ్చిందంటూ మెసేజ్‌ వచ్చిందా.. ? అయితే ఇలా చేయండి..!
Subhash Goud
|

Updated on: Jun 15, 2021 | 8:18 AM

Share

SBI Customer Alert: మీకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి గిఫ్ట్ వచ్చిందంటూ మెసేజ్‌ వచ్చిందా..? అయితే జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. లేకపోతే వేలు, లక్షల రూపాయలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుందని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎస్‌బీఐ కూడా తన ఖాతాదారులకు ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తోంది. కస్టమర్లను రోజురోజుకు అప్రమత్తం చేస్తూ ట్విట్టర్‌ ద్వారా అప్రమత్తం చేస్తోంది. అయితే ఎస్‌బీఐ కస్టమర్లు ఎక్కువగా ఉండటంతో నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. ఎస్‌బీఐ కస్టమర్లను మోసగించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుని మోసం చేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎస్‌బీఐ గిఫ్ట్‌ పంపిస్తోందని, ఇందు కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి అంటూ వినియోగదారులకు మెసేజ్‌లు వస్తున్నాయి. నిజంగానే ఎస్‌బీఐ ఈ మెసేజ్ పంపించిందేమోనని నమ్మి కస్టమర్లు దానిని క్లిక్‌ చేసినట్లయితే నేరగాళ్ల ఉచ్చులో పడిపోవాల్సిందే. ఇలాంటి మెసేజ్‌లు వస్తుంటే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి నేరాలకు పాల్పడిన ముఠాలను గుట్టురట్టు చేశారు హైదరాబాద్‌ పోలీసులు.

ఇలాంటి లింక్‌లు కలిగిన మెసేజ్‌లు వాట్సాప్‌, మెయిల్‌లకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఎవ్వరికి కూడా వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని తెలంగాణ సైబర్‌ పోలీసు విభాగం ప్రజలను హెచ్చరిస్తోంది. ఇలా నేరగాళ్లు పంపిన మెసేజ్‌ లింక్‌లను క్లిక్‌ చేస్తే వేలు, లక్షల్లో మోసపోయే అవకాశం ఉందంటున్నారు. ఈ లింక్‌ల ద్వారా మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మోసగించే అవకాశం ఉందంటున్నారు. ఇమెయిల్స్‌తో పాటు ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా సైబర్ నేరాలపై కస్టమర్లకు అవగాహన కల్పిస్తోంది.

లాటరీ స్కీమ్స్, గిఫ్ట్స్ లాంటివేవీ ఎస్‌బీఐ నుంచి ఉండవన్న విషయం కస్టమర్లు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. కస్టమర్లు ఇలాంటి ఫేక్ మెసేజెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఎస్‌బీఐ సిబ్బంది మిమ్మల్ని మీ పూర్తి వివరాలు, బ్యాంకు అకౌంట్‌ వివరాలు అడగరని, ఆఫర్లు, లోన్లు, గిఫ్ట్‌ల పేరుతో ఇలా మిమ్మల్ని మోసగించే అవకాశం ఉందని అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. లింక్‌లతో కలిగిన ఎలాంటి మెసేజ్‌లు వచ్చినా.. క్లిక్‌ చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.

ఇవీ కూడా చదవండి:

SBI Customer Alert: ఇలా చేస్తే మీరు ఇబ్బందులు పడాల్సిందే.. మరోసారి ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ..!

ATM Currency: ఏటీఎం నుంచి చిరిగిన, చెల్లని నోట్లు వచ్చాయా..? ఇలా చేసి మంచి నోట్లు తీసుకోండి..!