AP Viral News: సెంచరీ దాటిన పెట్రోల్ ధర.. వాహనం మార్చక తప్పదంటున్న జనం.. గాడిద సాయంతో
పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. బైక్ ముట్టుకోవాలంటేనే కరెంట్ షాక్ కొడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే.. బైక్‌ను పొదుపుగా వాడుతాం అంటారా..? కానీ...
పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. బైక్ ముట్టుకోవాలంటేనే కరెంట్ షాక్ కొడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే.. బైక్‌ను పొదుపుగా వాడుతాం అంటారా..? కానీ, అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన ఓ రజకుడు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. రాయదుర్గంకు చెందిన రమేష్ రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. గతంలో మార్కెట్లో గాడిదల ధరలు విపరీతంగా పెరగడంతో ఓ బైక్ కొని దాని మీద దుస్తులు తీసుకెళ్లడం చేసేవాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. బండి ముట్టాలంటే..పెట్రోల్ ధరలు చూసి భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్లో గాడిదల ధర కంటే, పెట్రోల్ ధరలే ఎక్కువగా ఉన్నాయని భావించిన రమేష్.. గాడిదలే నయమని భావించి వినూత్న ఆలోచన చేశాడు. తనకున్న బైక్‌ను పక్కన పడేసి, ఓ గాడిదను కొన్నాడు. ఆ గాడిదకే జట్కాను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇక గాడిద జట్కాతోనే తన వృత్తిని సాఫిగా సాగిస్తున్నాడు.
పెట్రోల్ పెరిగిందన్న చింత లేదు. గాడిదకు కాసింత గడ్డి వేస్తే చాలు కదా అంటున్నాడు రమేష్. అంతేకాదు, తను ఏర్పాటు చేసిన రిక్షాను గాడిదకు కట్టి పట్టణంలో చక్కర్లు కట్టిస్తున్నాడు. రమేష్ ప్రయోగాన్ని పట్టణ వాసులు వింతగా చూస్తున్నారు. మున్ముందు అందరూ ఇదే పద్దతి ఫాలో అవుతారని మరికొందరు కామెంట్లు విసురుతున్నారు.
Also Read: అతడి ఆత్మహత్యకు వాక్సిన్ భయమే కారణమా? పోలీసుల దర్యాప్తు