తండ్రి క్రూరత్వం.. కోరిక కాదన్నందుకు కన్నకూతుర్ని ఏం చేశాడంటే

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రి కన్నకూతురిపై అమానుషానికి పాల్పడ్డాడు. నీడలా వెన్నంటి ఉండి.. ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన ఆ తండ్రి తన కర్కశత్వాన్ని బయటపెట్టాడు. తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి...

తండ్రి క్రూరత్వం.. కోరిక కాదన్నందుకు కన్నకూతుర్ని ఏం చేశాడంటే
Wife Murder
Ganesh Mudavath

|

Mar 08, 2022 | 7:01 AM

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రి కన్నకూతురిపై అమానుషానికి పాల్పడ్డాడు. నీడలా వెన్నంటి ఉండి.. ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన ఆ తండ్రి తన కర్కశత్వాన్ని బయటపెట్టాడు. తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోనందుకు కూతుర్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరులతో కలిసి యువతి గొంతు కోసి ప్రాణం తీశాడు. బిహార్(Bihar) లోని​ గోపాల్​గంజ్(Gopal gunj) ​ప్రాంతానికి చెందిన ఓ యువతి తన తండ్రితో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న యువతి తండ్రి.. ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించాడు. సమీపంలోని బిర్చా గ్రామానికి చెంది ఓ అబ్బాయితో పెళ్లి(Marriage) జరిపించాలని అనుకున్నాడు. తండ్రి ప్రతిపాదనను యువతి తిరస్కరించింది.

ఆగ్రహానికి గురైన ఆమె తండ్రి ఇంద్రదేవ్.. మద్యం తాగి తన సోదరులతో కలిసి ఇంటికి వచ్చాడు. అనంతరం కూతురు చేతులు, కాళ్లు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్యను అడ్డుకునేందుకు వెళ్లిన తనపై కూడా దాడికి దిగినట్లు ఆమె వివరించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఇంద్రదేవ్, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వీరందరూ పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read

Viral Video: జడేజా స్టైల్‌ని ఫాలో అవుతున్న ఏనుగు పిల్ల.. ఫిదా అవుతున్న నెటిజన్లు

Petrol, Diesel prices: భారీగా పెరిగిన క్రూడా ఆయిల్ ధర.. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్​ ధరలు పెరుగుతాయా..!

Andhra Pradesh: మద్యం మత్తులో పోలీసులనే కొట్టారు.. ఆ తరువాత సీన్ చూస్తే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu