Petrol, Diesel prices: భారీగా పెరిగిన క్రూడా ఆయిల్ ధర.. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..!
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర భారీగా పెరిగింది. దీంతో ఈ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది...
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర భారీగా పెరిగింది. దీంతో ఈ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది. అయితే ఇన్ని రోజులు ఎన్నికలు ఉండడంతో పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే సోమవారంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల పర్వం ముగిసింది. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ తన అవసరాలలో అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతుంది. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 125 డాలర్ల పైగా ఉంది.
ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు రిరకార్డు స్థాయిలో పెరుగుతూ పోతున్నా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ప్రధాన చమురు మార్కెటింగ్ సంస్థలన్నీ ప్రభుత్వాధీనంలోనివే కావడంతో.. క్రూడ్ ఆయిల్ ధరలు భారమైనా.. ఆ భారాన్ని వాహనాదారులకు బదిలీ చేయడం లేదని తెలుస్తుంది. ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందనే భయాలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.15 నుంచి రూ.22 వరకు పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ స్థాయిలో ధరలు ఒకే సారి పెంచితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావచ్చని.. అందుకే దశల వారీగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉండవచ్చని భావిస్తున్నారు.
Read Also.. Cooking oil price: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం… మన వంటింట్లో మంట.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు