AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ మంత్రి కూతురు.. తండ్రి నుంచి రక్షణ కావాలంటూ పోలీసులకు విజ్ఞప్తి..

Love Marriage: ఆ మంత్రి కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లో వారికి చెప్పకుండా మనసుకు నచ్చిన వాడిని బెంగళూరులో పెళ్లి చేసుకుంది. మంత్రి నుంచి రక్షణ కావాలంటూ నవదంపతులు చివరికి పోలీసులను ఆశ్రయించారు.

Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ మంత్రి కూతురు.. తండ్రి నుంచి రక్షణ కావాలంటూ పోలీసులకు విజ్ఞప్తి..
Love Marriage
Ayyappa Mamidi
|

Updated on: Mar 08, 2022 | 6:38 AM

Share

Love Marriage: తమిళనాడుకు చెందిన ఒక మంత్రి కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లో వారికి చెప్పకుండా మనసుకు నచ్చిన వాడిని బెంగళూరులో పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఇందులో కొత్త మ్యాటర్ ఏంటనేగా మీకు అనుమానం.. తమిళనాడు మంత్రి శేఖర్​బాబు కుమార్తె జయకల్యాణి.. తనకు తండ్రి నుంచి ప్రాణహాని ఉందంటూ చివరికి పోలీసులను ఆశ్రయించింది. తన ప్రేమ విషయాన్ని ఇంట్లో వారు అంగీకరించలేదని.. తమకు రక్షణ కల్పించాలంటూ బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది ఈ కొత్త జంట.

మంత్రి కుమార్తె జయకల్యాణి.. సతీష్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. వీరు హిందూ సంప్రదాయం ప్రకారం బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో వివాహం చేసుకున్నారు. అనంతరం వారు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. సిటీ కమిషన్​ కార్యాలయానికి వెళ్లి.. తన తండ్రి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంత్రి శేఖర్​ బాబు అత్యంత సన్నిహితుడు కావటం విశేషం.

“నేను ఈ రోజు సతీష్​ను పెళ్లి చేసుకున్నాను. మాది ప్రేమ వివాహం. మా ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. కొన్ని నెలల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటానని సతీష్ ముందుకు వచ్చారు. అయితే తమిళనాడు పోలీసులు ఆయన్ను రెండు నెలల పాటు అక్రమంగా నిర్బంధించారు. ఇప్పుడు మేము మేజర్లం. ఈ పెళ్లి మా ఇద్దరి సమ్మతి మీదనే జరిగింది. తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని మా తల్లిదండ్రులు బెదిరించారు. అందుకే రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసులను ఆశ్రయించాము.”– జయ కల్యాణి, మంత్రి కుమార్తె

ఇదీ చదవండి..

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మరో బిగ్‌ ఆఫర్స్‌.. ఎప్పటి నుంచి అంటే..!

Follow Us
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"