AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Mains 2021: కోవిడ్‌ వల్లనే పరీక్ష రాయలేకపోయం.. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షకు అదనపు అటెంప్ట్‌ కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్‌!

కోవిడ్‌ కారణంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షను రాయలేకపోయిన అభ్యర్ధులు అదనపు ప్రయత్నాన్ని ( additional attempt) కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను మార్చి 21న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం తెల్పింది..

UPSC Mains 2021: కోవిడ్‌ వల్లనే పరీక్ష రాయలేకపోయం.. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షకు అదనపు అటెంప్ట్‌ కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్‌!
Upsc Mains
Srilakshmi C
|

Updated on: Mar 08, 2022 | 7:41 AM

Share

Petition on UPSC Mains 2021: కోవిడ్‌ కారణంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షను రాయలేకపోయిన అభ్యర్ధులు అదనపు ప్రయత్నాన్ని ( additional attempt) కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను మార్చి 21న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం తెల్పింది. యూపీఎస్సీ న్యాయవాది ఈ విషయంపై సూచనల కోసం కొంత గడువు కోరడంతో న్యాయమూర్తులు ఎఎం ఖాన్విల్కర్, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని సంబంధిత పక్షాలను కోర్టు కోరింది. కాగా యూపీఎస్సీ-2021 ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 3 అభ్యర్ధులు.. ఈ ఏడాది (2022) జనవరి 7-16 వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలను రాసేందుకు అర్హత సాధించారు. ఐతే ఆ సమయంలో ముగ్గురు అభ్యర్ధులకు కోవిడ్‌ పాజిటివ్‌ తేలడంతో.. ప్రభుత్వం జారీ చేసిన కఠిన ఆంక్షల కారణంగా యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయామని పిటీషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్‌ సోకినవారికి పరీక్ష సమయంలో ఎటువంటి ప్రత్యేక సదుపాయాలను కల్పించలేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 16 ప్రకారం తమ హక్కులకు భంగం వాటిల్లిందని, ఫలితాలకు ముందే తమకు అదనపు అటెంప్ట్‌కు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ పిటీషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ వాదనలు వినిపించారు. ఇక దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 21కు వాయిదా వేసింది.

Also Read: