RRB NTPC row: ఈ విషయంపై త్వరలోనే పరిష్కారం సూచిస్తాం.. రైల్వే శాఖ మంత్రి!
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్షలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆర్‌ఆర్‌బీ దరఖాస్తుదారులు లేవనెత్తిన ఆందోళనలను సీనియర్ అధికారులతో కూడిన హై-పవర్ కమిటీ పరిశీలించి, నివేదికను సమర్పించింది..
RRB NTPC Examination-2021: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్షలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆర్‌ఆర్‌బీ దరఖాస్తుదారులు లేవనెత్తిన ఆందోళనలను సీనియర్ అధికారులతో కూడిన హై-పవర్ కమిటీ పరిశీలించి, నివేదికను సమర్పించింది. దీనిపై ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి దరఖాస్తుదారులకు త్వరలో పరిష్కారం తెలియజేయబడుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw) ట్విటర్ ద్వారా ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి దాదాపు మూడు లక్షల ఫిర్యాదులు అందాయని, వాటిని విశ్లేషించిన తర్వాత కొద్ది రోజుల్లో పరిష్కారం తెలియజేస్తామని మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా RRB NTPC ఎగ్జామినేషన్-2021కు సంబంధించి ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. మొత్తం 35,000ల పోస్టులకు సుమారు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత విద్యార్హత ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చే విధంగా పరీక్షా విధానాన్ని రూపొందించారని, తుది ఎంపిక కోసం రెండు అంచెల పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఫలితంగా గత నెల్లో జరగవలసిన పరీక్షను రైల్వేశాఖ వాయిదా వేసి ఫిర్యాదులను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా టైర్-I (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఫలితాలు జనవరి 15న విడుదలవ్వగా.. ఈ పరీక్షలో కూడా అవకతవకలు చోటుచేసుకున్నాయని, పునఃపరిశీలిచాలని పేర్కొంటూ దాదాపు 3 లక్షల ఫిర్యాదులు దాఖలు చేశారు. ఇక ఈ విషయంపై విచారణ చేపట్టేందుకు రైల్వేశాఖ హై-పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. అన్నింటినీ పరిశీలించాక తగిన పరిష్కారం సూచిస్తామని మంత్రి తాజాగా తెలియజేశారు.
High Power Committee को करीब 3 lakh representations मिले। Committee ने इनका विश्लेषण कर लिया है। कुछ ही दिनों में RRB समाधान notify कर देगा।#रेलवे_भर्ती
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 5, 2022
Also Read: