Hemant Soren: సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య , పిల్లలు సహా 15 మందికి పాజిటివ్..

Jharkhand CM Hemant Soren’s house: కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుతోంది. థర్డ్ వేవ్‌లో

Hemant Soren: సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య , పిల్లలు సహా 15 మందికి పాజిటివ్..
Hemant Soren
Follow us

|

Updated on: Jan 09, 2022 | 10:16 AM

Jharkhand CM Hemant Soren’s house: కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుతోంది. థర్డ్ వేవ్‌లో సైతం సాధారణ ప్రజల నుంచి రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. పరీక్షల్లో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు నిగిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కోవిడ్ -19 పరీక్షలు చేసినట్లు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు.

వారిలో 24 మంది రిపోర్టులు శనివారం సాయంత్రం నాటికి వచ్చాయని.. వారిలో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వారిలో సీఎం భార్య కల్పనా సోరెన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ము ఉన్నారని కుమార్ తెలిపారు. నివాసంలో ఉన్న వారందరికీ తేలికపాటి కోవిడ్ -19 లక్షణాలు ఉన్నాయన్నారు. వారంతా ఇంట్లోనే సెల్ఫ్ క్వారెంటైన్ అయినట్లు తెలిపారు.

ఇదిలాఉంటే.. జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా సైతం కోవిడ్ బారిన పడ్డారు. శనివారం పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో ఆయన జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో ఐసోలేట్ అయ్యారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా అంతకుముందు కూడా ఆరోగ్యమంత్రి కరోనా సోకింది.

జార్ఖండ్‌లో ఇప్పటివరకు 3,74,000 కరోనా కేసులు నమోదు కాగా.. 5,164 మంది మరణించారు. 347,866 ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,098 యాక్టివ్ కేసులున్నాయి.

Also Read:

Omicron: దేశంలో భారీగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

India Covid-19: కరోనా విలయతాండవం.. దేశంలో లక్షన్నర మార్క్ దాటిన కేసులు..

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి