India Covid-19: కరోనా విలయతాండవం.. దేశంలో లక్షన్నర మార్క్ దాటిన కేసులు..

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కేవలం పది రోజుల్లోనే కరోనా మహమ్మారి ఏడు నెలల రికార్డును

India Covid-19: కరోనా విలయతాండవం.. దేశంలో లక్షన్నర మార్క్ దాటిన కేసులు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 09, 2022 | 9:37 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కేవలం పది రోజుల్లోనే కరోనా మహమ్మారి ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసులు మళ్లీ లక్షన్నర మార్క్‌ దాటి పరుగులు తీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేవలం పది రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్షన్నర మార్క్ దాటాయి. గడిచిన 24 గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా 1,59,632 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 327 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ప్రస్తుతం దేశంలో 5,90,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 40,863 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,44,53,603 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,790 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. డైలీ పాజిటివిటి రేటు అమాంతం 10.21 శాతానికి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 151.58 కోట్ల డోసులు అందించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. నిన్నటి నుంచి ప్రికాషనరీ డోసుకు రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభమయ్యాయి. జనవరి 10నుంచి ప్రికాషనరీ డోస్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా 60ఏళ్లకు పైబడిన వారికి, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ ప్రికాషనరీ డోసు అందిస్తారు.

Also Read:

Vikranth Rona: సుదీప్ 3 డీ మూవీ విక్రాంత్ రోణ‌ రూ.100 కోట్ల ఆఫర్.. సింపుల్‏గా నో చెప్పిన మేకర్స్..

Suvidha Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో నాలుగు స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే..