Suvidha Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో నాలుగు స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే..
Sankranti 2022 - Special Trains: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇళ్లకు వెళ్లేవారితో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ మేరకు ఇరు తెలుగు
Sankranti 2022 – Special Trains: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇళ్లకు వెళ్లేవారితో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ మేరకు ఇరు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీతో పాటు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్‌ను నడిపిస్తోంది. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. రద్దీ నేపథ్యంలో మరో నాలుగు సువిధ ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైళ్లు కాచిగూడ-కాకినాడ, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడవనున్నాయి.
కాచిగూడ-కాకినాడ టౌన్ (82724): ఈ నెల 12న రాత్రి 8 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.40కి కాకినాడ చేరుతుంది.
కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ ( 07450): ఈ రైలు 13న కాకినాడలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం (82719): ఈ రైలు జనవరి 12న రాత్రి 9.20కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖపట్నం-సికింద్రాబాద్ (07499): ఈ రైలు 13న విశాఖపట్నంలో రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఏఏ స్టేషన్లలో ఆగుతాయంటే..
కాచిగూడ-కాకినాడ టౌన్.. ఈ రైలు మల్కాజ్ గిరి, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.
కాకినాడ టౌన్-సికింద్రాబాద్.. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగంల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.
సికింద్రాబాద్ విశాఖపట్నం ట్రైన్.. ఈ ట్రైన్ నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లల్లో ఆగుతుంది.
Also Read: