AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉండి రుణం పొందడం ఎలా..? స్కోర్‌కు లోన్‌కు సంబంధం ఏమిటి..?

CIBIL Score: ఇప్పుడున్న రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వారే వారి సంఖ్య పెరిగిపోయింది. అలాగే కోవిడ్‌ మహమ్మారి తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా రుణాలు తీసుకునేవారి సంఖ్య కూడా..

CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉండి రుణం పొందడం ఎలా..? స్కోర్‌కు లోన్‌కు సంబంధం ఏమిటి..?
Subhash Goud
|

Updated on: Jan 09, 2022 | 9:46 AM

Share

CIBIL Score: ఇప్పుడున్న రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వారే వారి సంఖ్య పెరిగిపోయింది. అలాగే కోవిడ్‌ మహమ్మారి తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా రుణాలు తీసుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే తీసుకున్న రుణాలు గానీ, క్రెడిట్‌ కార్డు బిల్లులు గానీ సమయానికి చెల్లించకుంటే సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోయే అవకాశం ఉంది. గడువులోగా క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించకుంటే భవిష్యత్తులో రుణాలు తీసుకునే సమయంలో సిబిల్‌ ఎఫెక్ట్‌ పడుతుంది. వాహనాలపై రుణాలు తీసుకోవాలంటే సిబిల్‌ ప్రభావం చూపుతుంది. రుణం మంజూరు కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అందులో సిబిల్‌ స్కోర్‌ ముఖ్యమైనది.

సిబిల్‌ స్కోర్‌ ఎంతుంటే మంచిది: సిబిల్‌ స్కోరును క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) నిర్వహిస్తుంది. వ్యక్తి రుణ చరిత్ర ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. పలు అంశాలను, ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు. సాధారణంగా సిబిల్‌ 1000కి గానూ 550 కంటే ఎక్కువ ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అప్పుడే రుణం మంజూరులో ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. ఒక్కోసారి అంతకంటే తక్కువ ఉన్నా రుణం మంజూరు చేస్తారు. కానీ, వడ్డీరేటు ఎక్కువ ఉంటుంది. లేదా మంజూరు చేసే మొత్తం మన అవసరానికి సరిపోకపోవచ్చు.

సిబిల్‌ స్కోర్‌కు లోన్‌కు సంబంధం ఏమిటి..? బ్యాంకులకు రుణగ్రహీతలను అంచనా వేయడానికి ఉపయోగపడే కీలక సాధనం ఈ సిబిల్‌ స్కోర్‌. స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత సులభంగా రుణం మంజూరవుతుంది. సిబిల్‌ స్కోర్‌ మన రుణ చరిత్రను ప్రతిబింభిస్తుంది. మీరు గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపుల వంటి ఆర్థిక లావాదేవీలను ఈ స్కోరు సూచిస్తుంది. మీ బ్యాంకుల ఖాతాల నిర్వహణను కూడా దీన్ని బట్టి అంచనా వేయవచ్చు.

వ్యక్తిగత రుణం ఎలాంటి తనఖా లేకుండానే ఇచ్చే అన్‌సెక్యూర్డ్‌ రుణం. అలాంటప్పుడు సిబిల్‌ స్కోరే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ స్కోర్‌ తక్కువగా ఉంటే వ్యక్తగత రుణం పొందడం కొంత సవాల్‌తో కూడుకున్నదనే చెప్పాలి. ఒకవేళ ఇచ్చినా.. మనం అడిగిన దాని కంటే తక్కువ రుణం ఇవ్వడం, ఎక్కువ వడ్డీరేటు, తక్కువ కాలపరిమితితో కూడిన రుణాన్ని మంజూరు చేస్తాయి బ్యాంకులు. అయితే, కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థలు రూ.10,000-50,000 వరకు రుణాన్ని ఇస్తున్నాయి. సిబిల్‌ స్కోర్‌ విషయంలో పెద్దగా పట్టించుకోవు. సిబిల్‌కి బదులుగా ఈ సంస్థలు మన మొబైల్‌కి ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చే ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అంచనా వేస్తాయి. కొన్ని ఫిన్‌టెక్‌లైతే.. ప్రత్యేకంగా సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉన్నవాళ్లకే రుణాలు అందిస్తున్నాయి.

సిబిల్‌ స్కోర్‌ను మెరుగు పర్చుకోవాలంటే.. సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉండి, రుణం తప్పనిసరైతే.. డిజిటల్‌ రుణ సంస్థలను ఆశ్రయించడం మేలంటున్నారు ఆర్థిక నిపుణులు. వీటి నుంచి తీసుకొని సకాలంలో చెల్లిస్తే మీ సిబిల్‌ స్కోర్‌ కూడా మెరుగుపడుతుంది. తొలిసారి రుణం తీసుకుంటున్నవారు లేదా తక్కువ సిబిల్‌ స్కోర్‌ ఉన్నవారికి రుణం ఇవ్వడానికి సాధారణ బ్యాంకులు ఆసక్తి చూపవు. అలాంటి సందర్భంలో డిజిటల్‌ లెండర్ల నుంచి రుణం తీసుకొని సక్రమంగా చెల్లిస్తే.. మన సిబిల్‌ స్కోర్‌ పెరిగే అవకాశం ఉంది. అయితే, వీలైనంత వరకు తక్కువ మొత్తంలో రుణం తీసుకొని ఎప్పటికప్పుడు చెల్లించడం ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Honda: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? హోండా అద్భుతమైన ఆఫర్‌

PF Interest Deposited: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లో రూ.24 కోట్లు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం