Fixed Deposit Interest Rate: పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్-ఎస్బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పోల్చితే..!

Fixed Deposit Interest Rate: ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అందించే రకరకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (FD)లను ఎంచుకోవచ్చు. అటువంటి పొదుపు పథకాలకైనా ఏడు రోజుల..

Fixed Deposit Interest Rate: పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్-ఎస్బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పోల్చితే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 09, 2022 | 11:06 AM

Fixed Deposit Interest Rate: ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అందించే రకరకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (FD)లను ఎంచుకోవచ్చు. అటువంటి పొదుపు పథకాలకైనా ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను నిర్ణయించబడతాయి. అయితే ఎఫ్‌డీలో పెట్టిన మొత్తాన్ని మెచ్యూరిటీ వరకు వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. కానీ కారణాల వల్ల ముందస్తు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఉపసింహరించుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఎఫ్‌డీ ఎంచుకున్న పూర్తి మెచ్యూరిటీ వ్యవధిపై వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. ఇది 4 శాతం నుంచి 7.5 శాతం వరకు ఉంటుంది. బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాదిరిగానే పోస్టాఫీసు టైమ్‌ డిపాజిట్లు లేదా పోస్ట్‌ ఆఫీస్‌ టర్మ్‌ డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్లకు 1,2,3, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. పోస్ట్‌ ఆఫీసు టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు కాలానుగుణంగా మారుతూ ఉంటుంది.

ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంది. డబ్బులున్నవారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధికంగా మొగ్గు చూపుతుంటారు. ఇక బ్యాంకులు, పోస్టాఫీసులలో ఫిక్స్‌డ్‌లకు వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇక పోస్ట్ ఆఫీసులు ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు టర్మ్ డిపాజిట్లను అందిస్తాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాదిరిగానే పెట్టుబడిదారులు పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ కాల వ్యవధిలో హామీతో కూడిన రాబడిని పొందుతారు. మూడు సంవత్సరాల వరకు ఒక సంవత్సరం కాల డిపాజిట్ కోసం ఇది 5.5% వడ్డీ రేటును అందిస్తుంది. పోస్టాఫీసు ఐదు సంవత్సరాల కాల పరిమితి డిపాజిట్లకు 6.7% వడ్డీ రేటును అందిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు:

1 సంవత్సరం – 5.5 శాతం 2 సంవత్సరాలు – 5.5 శాతం 3 సంవత్సరాలు – 5.5 శాతం 5 సంవత్సరాలు – 6.7 శాతం

ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD):

7 రోజుల నుంచి 45 రోజుల వరకు – 2.9 శాతం 46 రోజుల నుంచి 179 రోజుల వరకు- 3.9 శాతం 180 రోజుల నుంచి 210 రోజుల వరకు -4.4 శాతం 211 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు – 4.4 శాతం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ – 5 శాతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు – 5.1 శాతం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు – 5.3 శాతం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు – 5.4 శాతం పై వడ్డీ రేట్లు సాధారణ ప్రజలకు రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉండే ఎఫ్‌డీలపై 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు ఉంటుంది. అయితే సీనియర్‌ సిటిజన్స్‌కు అదనంగా 0.8 శాతం అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉండి రుణం పొందడం ఎలా..? స్కోర్‌కు లోన్‌కు సంబంధం ఏమిటి..?

SBI Digital Banking: డిజిటల్‌ బ్యాంకింగ్‌పై ఎస్‌బీఐ కస్టమర్లకు కీలక సూచనలు.. మోసాల నుంచి రక్షించుకోండిలా..!