Honda: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? హోండా అద్భుతమైన ఆఫర్‌

Honda: మీరు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మంచి అవకాశం. హోండా నుండి నేరుగా కార్లను ఇష్టమైన మోడళ్లను కొనుగోలు చేయవచ్చు...

Honda: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? హోండా అద్భుతమైన ఆఫర్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jan 09, 2022 | 7:27 AM

Honda: మీరు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మంచి అవకాశం. హోండా నుండి నేరుగా కార్లను ఇష్టమైన మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం కంపెనీ పలు ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద మీరు ఒక సంవత్సరం లేదా 20000 కిమీల వారంటీని పొందుతారు. కంపెనీ తన సెకండ్ హ్యాండ్ కార్ ప్లాట్‌ఫారమ్ హోండా ఆటో టెర్రేస్ ద్వారా తన వినియోగదారులకు ఈ ఆఫర్‌ను అందిస్తోంది. కంపెనీ నుంచి అందిన వివరాల ప్రకారం.. హోండా నుండి సర్టిఫైడ్ కారును కొనుగోలు చేసుకోవచ్చు. ఎలాంటి మరమ్మతులు లేకుండా, కండీషన్‌గల కారును కొనుగోలు చేయవచ్చు. హోండా కార్లలో మీరు హోండా అమేజ్, హోండా సిటీ, హోండా జాజ్ మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ కార్ల ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. హోండా సిటీ కార్లు 2017 నుండి 2020 వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

హోండా ఆటో టెర్రేస్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ అంటే ఏమిటి? ఆటో టెర్రేస్ అనేది ఎక్స్ఛేంజ్, ప్రీ-ఓన్డ్ కార్ కొనుగోళ్ల కోసం హోండా వన్-స్టాప్ సదుపాయం ఉంది. ఆటో టెర్రేస్ ద్వారా మంచి సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొనుగోలు చేయవచ్చు. హోండా ఆటో టెర్రేస్ సౌకర్యం హోండా కార్స్ ఇండియా నెట్‌వర్క్ అంతటా అందుబాటులో ఉంది.

ధర ఎంత ఉంటుంది? సెకండ్ హ్యాండ్ హోండా సిటీ కార్ 2017 మోడల్‌ను రూ. 5 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. తాజా 2020 మోడల్ హోండా సిటీ ధర రూ. 14 నుంచి 15 లక్షలు ఉంటుంది. 2014 మోడల్ హోండా అమేజ్ కూడా రూ.2.65 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుగోలు చేసే అవకాశం హోండా కాకుండా, మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి ఇతర కంపెనీల కార్లను కూడా హోండా ఆటో టెర్రేస్ ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోలు చేయవచ్చు. 2014 మోడల్ మారుతి సుజుకి ఆల్టో రూ.1.95 లక్షలకు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, 2012 మోడల్ మారుతీ సుజుకి డిజైర్‌ను రూ. 2.27 లక్షలకు కొనుగోలు చేయవచ్చు, అయితే 2009 మోడల్ హ్యుందాయ్ ఐ10 ఎరా కేవలం రూ. 95,000కే కొనుగోలు చేయవచ్చు. 2013 మోడల్ ఫియట్ గ్రాండే పుంటో రూ.1.75 లక్షలకు లభ్యం కానుంది. ఇలా సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ఇవి కూడా చదవండి:

Hyundai SUV: టాటా పంచ్‌కు గట్టి పోటీ ఇవ్వనున్న హ్యందాయ్‌ ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీ.. అత్యాధునిక ఫీచర్స్‌

BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారే వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్‌..!