- Telugu News Photo Gallery Business photos BSNL Giving 5GB of Free Data to Customers Switching From Existing Network
BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారే వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్..!
BSNL Offer: టెలికం కంపెనీలు కస్టమర్ల కోసం రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్‌కు..
Updated on: Jan 08, 2022 | 1:44 PM

BSNL Offer: టెలికం కంపెనీలు కస్టమర్ల కోసం రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్‌కు మారే వినియోగదారులకు నెల రోజులపాటు అదనంగా 5జీబీ డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

ఈ బంపర్ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదనంగా వచ్చే డేటా 30 రోజులపాటు, లేదంటే ప్రస్తుత ప్లాన్ కాలపరిమితి ముగిసే వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

వినియోగదారులు బీఎస్ఎన్‌లోకి మారాలనుకుంటే కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. బీఎస్ఎన్ఎల్‌లోకి ఎందుకు మారుతున్నదీ సామాజిక మాధ్యమాల్లో కారణం చెప్పాల్సి ఉంటుందని తెలిపింది #SwitchToBSNL హ్యాష్‌టాగ్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో షేర్ చేయాలి. బీఎస్ఎన్‌ఎల్‌కు మారుతున్న రుజువులను పంపాల్సి ఉంటుందని తెలిపింది. ఇలా చేస్తేనే ఈ బెనిఫిట్ పొందవచ్చు.

తర్వాత కూడా బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది. యూజర్లు తమ ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను నేరుగా మెసేజ్ ద్వారా కానీ, లేదంటే వాట్సాప్ నంబరు 9457086024లో గానీ షేర్ చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్‌లోకి మారే వినియోగదారులు రీచార్జ్ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.




