Omicron: దేశంలో భారీగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Omicron cases in India: దేశంలో కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. రోజురోజుకూ కరోనాతోపాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య

Omicron: దేశంలో భారీగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Omicron
Follow us

|

Updated on: Jan 09, 2022 | 10:00 AM

Omicron cases in India: దేశంలో కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. రోజురోజుకూ కరోనాతోపాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలోని 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న కేసుల సంఖ్య భారీగా పెరిగింది. శనివారం ఒక్కరోజే 552 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో.. అత్యధికంగా మహారాష్ట్రలో 1009 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, రాజస్థాన్‌లో 373, కేరళలో 333, గుజరాత్‌లో 204, తమిళనాడులో 185 కేసులు, హర్యానాలో 129, తెలంగాణలో 129, ఆంధ్రప్రదేశ్‌లో 28 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా.. ఎక్కువగా మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ బారి నుంచి 1409 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే.. రానున్న కాలంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేస్తోంది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా విలయతాండవం చేసు్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా.. రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా 1,59,632 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 327 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం దేశంలో 5,90,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 40,863 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,44,53,603 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,790 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

India Covid-19: కరోనా విలయతాండవం.. దేశంలో లక్షన్నర మార్క్ దాటిన కేసులు..