What is Bulli Bai app: అసలు బుల్లీ బయ్ యాప్ కథేంటి? జాతీయ రాజకీయాల్లో ఎందుకింత రచ్చ.. టార్గెట్ ఎవరూ..
జాతీయ రాజకీయాల్లో తీవ్ర రచ్చకు దారితీసింది బుల్లీ బయ్ యాప్. దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. అసలు బుల్లీ బయ్ యాప్ కథేంటి? మహిళల ఆత్మగౌరవాన్ని ఆన్‌లైన్ వేలంలో..
జాతీయ రాజకీయాల్లో తీవ్ర రచ్చకు దారితీసింది బుల్లీ బయ్ యాప్. దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. అసలు బుల్లీ బయ్ యాప్ కథేంటి? మహిళల ఆత్మగౌరవాన్ని ఆన్‌లైన్ వేలంలో పెట్టిన అకృత్యం దేశ రాజధానిలో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వంద మందికిపైగా ముస్లిం మహిళల చిత్రాలను, అభ్యంతరకరంగా మార్చి యాప్‌లో వేలానికి ఉంచిన ఉదంతం కలకలం రేపుతోంది. బుల్లీ బయ్ పేరుతో ఉన్న ఆ యాప్‌లో తన ఫొటోను అమ్మకానికి ఉంచారంటూ, ఓ ముస్లిం జర్నలిస్టు పోస్టు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. దీనిపై ఆమె ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అటు ముంబయి పోలీసులు కూడా దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైంది కేంద్రం. ఆ యాప్‌కు హోస్టింగ్ సేవలు అందిస్తున్న గిట్‌హబ్ సంస్థ దాన్ని బ్లాక్ చేసిందని వెల్లడించారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్.
ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, సంబంధిత సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా తమకు తెలియజేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ. ఈ యాప్‌పై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది వంటి నేతలు సీరియస్ అవుతున్నారు.
మహిళలను అవమానించే ఇలాంటి దుశ్చర్యలను అడ్డుకోవాలంటే అందరు ఒక్కటై పోరాడాలని ట్వీట్ చేశారు రాహుల్. నేరస్థులకు శిక్షలు పడకపోవడం వల్లే ఇంకా మితిమీరిపోతున్నారని ట్వీట్ చేశారు ఒవైసీ. బుల్లీ బయ్ యాప్ ఇష్యూను ముంబయి పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని, నేరస్థులను కఠినంగా శిక్షించాలని చేశారు ప్రియాంకా చతుర్వేది డిమాండ్.
ఇవి కూడా చదవండి: Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..
Viral Video: కుందేలపై మరోసారి గెలిచిన తాబేలు.. ఇది కథకాదు నిజం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..