Omicron Treatment: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చికిత్సకు ఆరోగ్య బీమా..ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఆదేశం..!
Omicron Treatment: తాజాగా వెలుగు చూస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చికిత్సకు అయ్యే ఖర్చులకు కూడా కోవిడ్ ఆరోగ్య బీమా పాలసీలు, జనరల్ ఇన్సూరెన్స్, ఆరోగ్య..
Omicron Treatment: తాజాగా వెలుగు చూస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చికిత్సకు అయ్యే ఖర్చులకు కూడా కోవిడ్ ఆరోగ్య బీమా పాలసీలు, జనరల్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కంపెనీలు జారీ చేసే ఆరోగ్య పాలసీలు కవరేజి ఇస్తాయని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ప్రకటించింది. భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని సాధారణ, ఆరోగ్య బీమా పాలసీదారులు ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం వస్తే వారికి నగదు రహిత, సత్వర సేవలు అందించేందుకు నెట్‌వర్క్ ఆస్పత్రులతో సమన్వయానికి ఒక సమర్ధవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని బీమా కంపెనీలకు సూచించింది.
ష్యూరిటీ ఇన్సూరెన్స్ బాండ్ల మార్గదర్శకాలు:
ష్యూరిటీ బీమా విభాగం క్రమబద్ధమైన అభివృద్ధి కోసం ష్యూరిటీ బాండ్ల జారీకి అవసరమైన మార్గదర్శకాలు సెబీ జారీ చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కాంటాక్టుపై సంతకం చేసిన వ్యక్తి ష్యూరిటీ చెల్లింపులో విఫలమైతే ఈ బీమా రక్షణ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి: