AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Moto India: గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన ప్లాంట్‌.. భారీగా ఉద్యోగ అవకాశాలు

One Moto India: బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ది టూవీలర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ వన్‌-మోటో తయారీ ప్లాంట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడితో..

One Moto India: గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన ప్లాంట్‌.. భారీగా ఉద్యోగ అవకాశాలు
Subhash Goud
|

Updated on: Jan 04, 2022 | 1:05 PM

Share

One Moto India: బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ది టూవీలర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ వన్‌-మోటో తయారీ ప్లాంట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటు కారణంగా ప్రత్యేక్షంగా 500, పరోక్షంగా 2 వేల వరకు ఉపాధి కల్పించనుంది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇక ఇండియాలోని ప్రీమియం ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బ్రిటీష్‌ బ్రాండ్‌ వన్‌-మోటో (One Moto) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వన్‌-మోటోకు చెందిన తయారీ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సదరు సంస్థ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్‌ నగర శివారులో ఈ వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో కొత్త విప్లవాన్ని సృష్టిస్తామనే నమ్మకం ఉందని వన్‌-మోటో సంస్థ ఆశాభావం వ్యకత్ం చేసింది. ఈ తయారీ యూనిట్‌ కోసం దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వన్‌-మోటో సీఈవో శభంకర్‌ చౌదరి తెలిపారు.

భారత దేశంలో అన్ని ఉత్పత్తులను నిర్వహించి మార్కెట్‌ను మరింతగా తీర్చిదిద్దే ఆలోచన ఉందన్నారు. రెండు సంవత్సరాలలో తమ సామర్థ్యాన్ని 1 లక్ష వరకు పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌లో మొదటి సంవత్సరంలో దాదాపు 40 వేల ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు కంపెనీ సీఈవో తెలిపారు. తమ ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2 వేల మందికిపైగా ఉపాధి కల్పించినట్లు అవుతుందని ఆయన తెలిపారు.

15 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ఏర్పాటు: ఈ వన్‌-మోటో ఎలక్ట్రిక్‌ వాహనాల తయరీ ప్లాంట్‌ను 15 ఎకరాల విస్తీర్ణయంలో ఏర్పాటు చేయనున్నట్లు సీఈవో తెలిపారు. ఈ ప్లాంట్లలో అదనపు సెమీ రోబోటిక్స్‌, అత్యాధుని ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి సరికొత్త తయారీ యంత్రాలతో కూడిన ప్రధాన ఆటోమేషన్‌ ఇంటిగ్రేషన్‌ ఉంటుందన్నారు. తెలంగాణలోని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ద్వారా రెండు ఇండియన్ ఫ్లీట్ లలో పాటు అన్నీ వన్-మోటో ఫ్లీట్ లను ఉత్పత్తి చేయనున్నారు. వీటిని ఎల్లీసియం ఆటోమోటివ్స్ దేశంలోకి ప్రవేశపెట్టనున్నాయి.

ఇవి కూడా చదవండి:

Deadlines: వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్‌.. 2022లో చేసుకోవాల్సిన పనులు ఇవే.. గడువు దాటితే పెనాల్టీ..!

Car Launches: 2022లో విడుదల కానున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ఖరీదుండే కార్లు ఇవే..!