AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava Benefits: జామతో బోలెడు ప్రయోజనాలు.. అలాంటి వారికి అదిరిపోయే బెనిఫిట్స్‌..!

Guava Benefits: ప్రస్తుతమున్న జీవన శైలి కారణంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రుల చుట్టూ తిరిగేదానికంటే కొన్ని చిట్కాలను పాటిస్తే..

Guava Benefits: జామతో బోలెడు ప్రయోజనాలు.. అలాంటి వారికి అదిరిపోయే బెనిఫిట్స్‌..!
Subhash Goud
|

Updated on: Jan 04, 2022 | 1:02 PM

Share

Guava Benefits: ప్రస్తుతమున్న జీవన శైలి కారణంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రుల చుట్టూ తిరిగేదానికంటే కొన్ని చిట్కాలను పాటిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా ప్రతి రోజు తీసుకునే ఆహారం కంటే పండ్లు కూడా తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఇక సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే పండ్లలో జామ ఒకటి. జామతోపాటు వాటి ఆకులతో కూడా ఎన్న ప్రయోజనాలున్నాయి. అయితే కొన్ని మాత్రం పెద్దగా ఖర్చులేకుండానే ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామకాయలో ఎన్నో పోషకాలున్నాయి. జామ జ్యూస్‌ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాకుండా కాలేయానికి ఎంతో ఔషధంలా పని చేస్తుంది. అలాగే ప్రస్తుతం డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అలాంటి వారికి జామ ఎంతో ఉపయోగకరం. రక్తంలో షుగర్స్‌ లేవల్స్‌ను తగ్గించేస్తుంది. వీటిని తరుచుగా తీసుకుంటే మరీ మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.

గుండెకు మేలు: గుండెను కాపాడుతుంది. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హైబీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగాలి. జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు… విషవ్యర్థాలను తొలగిస్తుంది. గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, కరిగిపోయే ఫైబర్ వంటివి గుండె పని తీరును మెరుగు పరుస్తాయి.

జామ పండ్ల ఆకుల రసం తాగితే.. మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే ఎంతో మంచిది. దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఓ నాలుగు జామ ఆకులను నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో.. పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులను మంచి ఔషధంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇక జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. మలబద్ధకం ఉన్న వారికి జామ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక జామకాయ మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్‌‌లో 12 శాతం ఇస్తుంది. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

► జామలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఫైబర్‌ సమృద్దిగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారించడంతో ఎంతో ఉపయోగపడుతుంది.

► ఇందులోఏబీసీ విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల వయసు రీత్యా చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి.

► జామ పండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

► ఉపిరితిత్తులకు, చర్మానికి, కంటికి చాలా మంచిది. ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.

► జామలో ఉండే పోటాషియం గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.

► జామ వల్ల బీపీ పెరగకుండా ఉంటుంది. జామలో బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌ ఎర్ర రక్త కణాళ ఉత్పత్తిలో జామ ఎంతగానో ఉపయోగపడుతుంది.

► జామలో విటమిన్‌-సి, లైకోపీన్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో మాంగనీస్‌ కూడా పుష్కలంగా ఉంటాయి.

► మనం తినే ఆహారం నుంచి ఇతర కీలక పోషకాలను గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. జామపండు తినడం వల్ల మెదడు పనితీరు ఎంతో మెరుగు పడుతుంది.

► కాన్సర్ వస్తే.. దానిని వదిలించుకోవడం ఓ సాహసమే అని చెప్పాలి. జామ ఆకుల్లో కాన్సర్‌ను నిరోధించే గుణాలు అధికంగా ఉన్నాయి. కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది. కణాలను కాపాడుతుంది. కాన్సర్ మందుల కంటే… జామ రసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపించగలదని పరిశోధనల్లో తేలింది.

ఇవి కూడా చదవండి:

Health Tips: పరగడుపున ఈ పనులు చేయద్దు.. అనారోగ్యం బారిన పడినట్లే..!

Diabetes: మీకు డయాబెటిస్‌ ఉందా..? ఇలా చేస్తే షుగర్ లెవల్స్ అదుపులో పెట్టుకోవడం సులభమే..