Train Accident: మరోసారి రైల్వేసిగ్నలింగ్‌ వ్యవస్థ ఫెయిల్‌.. ఢీకొన్న రెండు రైళ్లు..

ఒడిశా ప్రమాదం నెత్తుటి మరకలు ఆరక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇది కూడా సిగ్నల్ ఫెయిల్యూర్‌గా తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు గూడ్స్‌ రైళ్లు ఢీకొన్నాయి. గూడ్స్‌ కాకుండా ప్యాసింజర్‌ రైలు అయితే ప్రమాద తీవ్రత ఊహించుకోవడానికే భయమేస్తోంది.

Train Accident: మరోసారి రైల్వేసిగ్నలింగ్‌ వ్యవస్థ ఫెయిల్‌.. ఢీకొన్న రెండు రైళ్లు..
Train Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 25, 2023 | 8:15 AM

ఒడిశా ప్రమాదం నెత్తుటి మరకలు ఆరక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇది కూడా సిగ్నల్ ఫెయిల్యూర్‌గా తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు గూడ్స్‌ రైళ్లు ఢీకొన్నాయి. గూడ్స్‌ కాకుండా ప్యాసింజర్‌ రైలు అయితే ప్రమాద తీవ్రత ఊహించుకోవడానికే భయమేస్తోంది. లూప్‌లైన్‌లోఉన్న గూడ్స్‌ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. 12 బోగీలు పట్టాలు తప్పగా.. ప్రమాదంలో లోకో పైలట్‌కు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బంకురా సమీపంలో ఓండా స్టేషన్ దగ్గర జరిగింది. ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిన తీరుపై, కారణాలపై ఆరా తీస్తున్నారు.

జూన్‌ 2వ తేదీన ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో ఏకంగా 292 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అనేక అనుమానాలు, ఆరోపణల నేపథ్యంలో సిబిఐ విచారణ కొనసాగుతోంది. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ‌రెండు గూడ్స్ రైళ్లు కావడంతో ప్రాణ నష్టం జరుగలేదు. అదే ప్యాసింజర్ ట్రైన్ అయితే? పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉంది. అయితే, సిబ్బంది కొరత కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కొందరు వాదిస్తుంటే.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అని కొందరు, కావాలనే చేస్తున్నారని ఇంకొదరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ప్రజలను, ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..