Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
Gold And Silver Rates: కొన్నాళ్లుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. దీంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాబట్టి తగ్గిన ధరల ప్రకారం ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

గత కొన్ని రోజులుగా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరుగుతూ వస్తోన్న విషయం అందిరికీ తెలిసిందే. కొన్ని సార్లు అయితే ఊహించని రీతిలో ఒకే రోజులు వేలల్లో బంగారం ధరలు పెరిగాయి. ఇందుకు ప్రధాన కారణం అమెరికా-వెనిజులా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అనే చెప్పవచ్చు. వెనిజులా సంక్షోభంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో సురక్షిత సాధనాలైన బంగారం, వెండి, రాగి సహా కమొడిటీస్ వంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. అయితే గత రెండు రోజులుగా బంగారం ధరల స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. ఇక శుక్రవారం ఉదయం 6 గంటలకు దేశీయ ప్రధాన నగరాలతో సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
- తగ్గిన ధరల తర్వాత హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన తులం బంగారం ధర రూ.1,37,990గా కొనసాగుతుంది. ఈ ధర నిన్న రూ.1,38,260గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,490గా ఉండగా. నిన్న ఈ ధర రూ.1,26,740 వద్ద స్థిరపడింది.
- విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,37,990గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,26,490 వద్ద కొనసాగుతోంది. ఇక వైజాగ్‌లో కూడా ప్రస్తుతం ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
- అటు చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,080 వద్ద కొనసాగుతుండగా.. నిన్న ఈ ధర రూ.1,39,630గా ఉంది. ఇక ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,490 వద్ద కొనసాగుతుండగా నిన్న ఈ ధర రూ.1,27,900గా ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,37,990గా వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,26,490 వద్ద కొనసాగుతోంది.
- దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,140 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,26,640గా ఉంది.
- ఇక ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,990గా వద్ద కొనసాగుతోండగా 22 క్యారెట్ల ధర రూ.1,26,490 వద్ద కొనసాగుతోంది.
ఇక దేశంలో పాటు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు
- దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,51,900గా ఉండగా ఈ ధర నిన్న రూ.2,57,100 వద్ద స్థరపడింది
- హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,71,900గా కొనసాగుతుండగా నిన్న ఈ ధర .2,77,100 వద్ద స్థరపడింది
- ఇక చెన్నైలో కేజీ వెండి రూ.2,71,900 వద్ద కొనసాగుతోంది
- -బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,51,900 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
