Health Tips: నీరు లేదా పాలు.. శరీరాన్ని హైడ్రేట్ ఉంచడానికి ఏది బెటర్.. నిపుణులు సజెస్ చేస్తుందేంటి?
సాధారణంగా శీతాకాలంలో మన శరీరం ఊహించిన దానికంటే వేగంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఎందుకంటే చల్లని వాతావరణం కారణంగా మనకు ఎక్కువగా దాహం వేసినట్టు అనిపించదు. దీంతో మనం నీటిని తక్కువగా తీసుకుంటాం. కానీ ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. డీహైడ్రేషన్ అనేది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కాబట్టి శీతాకాలంలో కూడా మన శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకు కోసం నీటి కంటే పాలను తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా డీహైడ్రెట్ కాకుండా ఉండాలంటే నీటిని తీసుకోవాలని చాలా మంది చెబుతుంటారు. కానీ శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచేందుకు నీటి కంటే పాలు ఎక్కువగా ఉపయోగపడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2016లో ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో పబ్లీష్ అయిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. నీరు లేదా స్పార్క్లింగ్ వాటర్, ఫుల్-ఫ్యాట్ మిల్క్, స్కిమ్ మిల్క్, కోలా, స్పోర్ట్స్ డ్రింక్స్, కాఫీ, బీర్, ఆరెంజ్ జ్యూస్ వంటి ఇతర డ్రింక్స్‌తో పోలిస్తే పాలు తాగినప్పుడు మూత్ర విసర్జన మెరుగ్గా ఉంటుందని చెబుతున్నాయి. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు మనం తీసుకునే పానియాల హైడ్రేషన్ ఇండెక్స్ (BHI)ను తనికీ చేశారు. BHI ప్రకారం పాలు నీటి కంటే మెరుగ్గా మన శరీరాన్ని హైడ్రేషన్‌గా ఉంచుతాయని నిర్ధారణ అయింది.
హైడ్రేషన్ విషయంలో నీటి కంటే పాలు ఎందుకు బెటర్?
శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచడంలో నీటి కంటే పాలు మెరుగ్గా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పాలలో మాక్రోన్యూట్రియెంట్లు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం సజావుగా పనిచేయడానికి సహాయపడుతాయి. అలాగే, పాలు సహజ చక్కెరలు, ప్రోటీన్లు, కొవ్వులతో నిండి ఉంటాయి, ఇవి కడుపును ఎక్కుక సేపు నిండిన అనుభవాన్ని కలిగిస్తాయి. మీ శరీరంలో ద్రవాలను ఎక్కువసేపు ఉంచుతాయి. అలాగే తక్కువ మూత్ర ఉత్పత్తికి, మెరుగైన ద్రవ సమతుల్యతకు సహాయపడుతాయి.
పాల వల్ల కలిగే ప్రయోజనాలు
వర్కౌట్స్ చేసి వారికి, క్రీడలు ఆడేవారికి తక్కువ ఫ్యాట్ మిల్క్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయిం. ఎందుకంటే ఇది వాళ్లను ఎక్కవ సేపు హైడ్రెడ్‌గా ఉంచుంతుంది. పాటు శరీరంలో ద్రవాలను భర్తీ చేయడంతో పాటు, కండరాల పెరుగుదలకు మద్దతు ఇస్తాయి. అలాగే సూక్ష్మపోషకాలను అందిస్తాయి. అందుకే చాలా మంది అథ్లెట్లు చాలా రోజులు వ్యాయామం తర్వాత ఎక్కువగా పాలు, చాక్లెట్స్ తీసుకుంటారు.
పాలను ఎప్పుడు తీసుకోవాలి
మీ శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచుకోవాలంటే మీరు రోజుకూ కనీసం 8 గ్లాస్‌ల వాటర్ తాగాల్సి ఉంటుంది. అయితే ఎవరు ఎంత నీరు తాగాలి అనే వాళ్ల వయస్సు, వాళ్లు చేసే, గర్భధారణ స్థితి, వాతావరణం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఆరు గ్లాసుల నీళ్లు తాగితే, మరికొందరికి 12 గ్లాసుల తాగవచచ్చు. దీనికి బదులు మీరు పాలను ఎంచుకోవడం ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే అందులో కేలరీలు, సహజ చక్కెరలు కూడా ఉంటాయి. మార్కెట్లో అత్యల్పంగా లభించే ఒక కప్పు స్కిమ్ మిల్క్‌లో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్‌లతో పాటు దాదాపు 90 కేలరీలు ఉంటాయి.
NOTE: పైన పుర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెన్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడిని.. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
