Sameera Sherief: ఆ అంకుల్ ముద్దు చేసేవారు అనుకున్నా.. కానీ తర్వాతే అర్థమైంది.. సీరియల్ నటి సమీరా షెరీఫ్..
ఇటీవల కాలంలో చాలా మంది తారలు తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. అటు సీరియల్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా సీరియల్ నటీమణులు సైతం తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, లైంగిక వేధింపులు గురించి సోషల్ మీడియా వేదికగా బయటపెడుతున్నారు. తాజాగా సీరియల్ నటి సమీరా షెరీప్ సైతం తన లైఫ్ లో ఉన్న చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.

బుల్లితెర ప్రేక్షకులకు నటి సమీరా షెరీఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా తెలుగు సినిమా ప్రపంచంలో కొనసాగుతుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె చాలా సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆడపిల్ల అనే సీరియల్ ద్వారా సమీరాకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత సీరియల్స్ లో సహయ నటిగా కనిపించి అలరించింది. కొన్నాళ్ల క్రితం సినిమా నటి సన కుమారుడు అన్వర్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన సమీరా.. తన అత్తయ్యతో కలిసి యూట్యూబ్ ఛానల్లో సందడి చేస్తుంది. తాజాగా చిన్నప్పుడు ఎదురైన చేదు అనుభవాలను తన అత్తయ్య సనతో చెబుతున్న వీడియోస్ షేర్ చేసింది సమీరా. పిల్లలకు ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాలంటూ కోరింది.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
“మా చిన్నప్పుడు ఎదురింట్లో ఉన్న ఆంటీ వాళ్ల ఇంటికి బంధువులు వచ్చేవారు. వారిలో అంకుల్ లాంటి అన్న కూడా ఉండేవారు. చిన్న పిల్లలను ముద్దు చేస్తాం కదా.. అలా నా బుగ్గలు పట్టుకుని ముద్దు చేసేవారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. మేము రైల్వే కోటస్ లో ఉండేవాళ్లం. మేమున్న కోటస్ లో స్టెప్స్ ఉండేవి. టెర్రస్ కు వెల్లే స్టెప్స్ దగ్గరకి ఎవరు ఎక్కుగా రారు. ఒకసారి అందరం కలిసి దొంగాట ఆడుతున్నాం. అప్పుడు ఆ అంకుల్ కూడా మాతో జాయిన్ అయ్యారు. ఆ టెర్రస్ మెట్ల దగ్గరకు నన్ను తీసుకెళ్లి ముద్దు చేసేవారు. ఒక సందర్భంలో నాకు అది అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆ తర్వాత పెద్దయ్యాక నాకు అర్థమయ్యింది. ఆయన ముద్దు చేసేవారు కాదు.. ఆయన కోరికలు నామీద తీర్చుకునేవారు. చెప్పాలంటే అది పిల్లల మీద జరిగిన లైంగిక దాడి లాంటిదే. అప్పుడు నాకు అంత అవగాహన లేదు. తల్లిదండ్రులకు ఉండొచ్చు.. కానీ పిల్లలకు నేర్పించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలని పేరెంట్స్ అనుకోలేదు. ఒక వేళ నేను చెప్పినా నన్నే ప్రశ్నిస్తారు. నువ్వెందుకు అక్కడకు వెళ్లావ్ అని తిట్టేవారు” అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
పిల్లలకు ఇలాంటి ఎదురైతే నువ్వు కంగారు పడకు నీకు మేమున్నామనే దైర్యాన్ని పేరెంట్స్ ఇవ్వాలి.. కానీ ముందు మనం పిల్లల్ని తిట్టేస్తే వాళ్లకు చెప్పాలని కూడా అనిపించదు .. అలాంటి భయంతోనే నేను అప్పుడు అది చెప్పలేదు. కొంతమంది చూపించేది ప్రేమ కాదు.. పిల్లల మీద వాళ్ల కోరికలు తీర్చుకుంటున్నారు అంటూ తెలిపింది సమీరా.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..




