AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections 2024: ‘ఆరోదశ పోలింగ్‎తో బీజేపీకి 400 సీట్లు ఖాయం’.. కేంద్ర మంత్రి అమిత్ షా జోస్యం..

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీల అగ్రనేతలు మాటల తూటాలను పేలుస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు దశల పోలింగ్‌లో బీజేపీ 350 సీట్లు దాటేసిందన్నారు . కాంగ్రెస్‌కు కేవలం 40 సీట్లు మాత్రమే వస్తాయని, ఈవిషయం రాహుల్‌గాంధీకి కూడా తెలుసన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీపార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే వస్తాయన్నారు అమిత్‌షా.

Lok Sabha Elections 2024: 'ఆరోదశ పోలింగ్‎తో బీజేపీకి 400 సీట్లు ఖాయం'.. కేంద్ర మంత్రి అమిత్ షా జోస్యం..
Union Minister Amith Shah
Srikar T
|

Updated on: May 23, 2024 | 9:35 PM

Share

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీల అగ్రనేతలు మాటల తూటాలను పేలుస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు దశల పోలింగ్‌లో బీజేపీ 350 సీట్లు దాటేసిందన్నారు . కాంగ్రెస్‌కు కేవలం 40 సీట్లు మాత్రమే వస్తాయని, ఈవిషయం రాహుల్‌గాంధీకి కూడా తెలుసన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీపార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే వస్తాయన్నారు అమిత్‌షా. ఉత్తరప్రదేశ్‌‎లోని సంత్‌కబీర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్‌షా. కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి నేతలు పగటికలలు కంటున్నారని అన్నారు. ప్రధాని మోదీ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.

ఆరోదశ పోలింగ్‌ పూర్తయ్యే నాటికి బీజేపీకి 400 సీట్లు దాటడం ఖాయమన్నారు. ఇండియా కూటమిపై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. హర్యానా లోని భివానిలో ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ మిత్రపక్షాలు కుట్ర చేశాయన్నారు మోదీ. ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు చెల్లవని కోల్‌కతా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి.. బెంగాల్‌ ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదన్నారు మోదీ. ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు చట్టవిరుద్దమన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయన్నారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. ఇండియా కూటమి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఢిల్లీ ఏపీ భవన్‌లో లంచ్‌ చేశారు రాహుల్‌. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అదానీ , అంబానీల కోసమే మోదీ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.