AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajnath Singh: తనకు ఇచ్చిన వెండి కిరీటాన్ని పేద పెళ్లి కూతురుకు గిఫ్టుగా ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్

ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం (మే 22) ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు వెండి కిరీటాన్ని అందజేశారు. దీంతో ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల తర్వాత వెండి కిరీటాన్ని విక్రయించి పేద ఆడబిడ్డలకు కాళ్లకు పట్టీలు ఇప్పిస్తానని చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయం పట్ల పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Rajnath Singh: తనకు ఇచ్చిన వెండి కిరీటాన్ని పేద పెళ్లి కూతురుకు గిఫ్టుగా ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh
Balaraju Goud
|

Updated on: May 23, 2024 | 2:27 PM

Share

ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం (మే 22) ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు వెండి కిరీటాన్ని అందజేశారు. దీంతో ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల తర్వాత వెండి కిరీటాన్ని విక్రయించి పేద ఆడబిడ్డలకు కాళ్లకు పట్టీలు ఇప్పిస్తానని చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయం పట్ల పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

6వ విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో మే 25వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలోనే వాయువ్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి యోగేంద్ర చందోలియాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. బుద్ధ విహార్‌కు చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌కు బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాజ్‌నాథ్‌కు పూలమాలలు వేసి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌కు వెండి కిరీటం బహుకరించారు. అయితే కాసేపటి తర్వాత.. ‘ఎన్నికల తర్వాత ధరించిన వెండి కిరీటాన్ని అమ్మి పెళ్లి చేసుకోబోతున్న పేద కుమార్తెకు పట్టీలుగా ఇప్పిస్తాను’ అని చెప్పారు. అలాగే, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి, ప్రతి ఒక్కరూ ఇలాంటి విలువైన బహుమానాల కంటే పేద ఆడబిడ్డల వివాహాలకు కానులుగా ఇచ్చి ఆదుకోవాలని అందరినీ అభ్యర్థించారు రాజ్‌నాథ్ సింగ్.

అదే సమయంలో, ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గురించి చాలా విన్నాము, కానీ కేజ్రీవాల్ వల్ల జైలు నుండి వర్క్ గురించి కూడా మొదటిసారి విన్నాము. కేజ్రీవాల్ కంటే ముందు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎదుర్కోలేదు. అవినీతికి పాల్పడి ఏ సీఎం జైలుకు వెళ్లలేదని, అక్కడి నుంచే సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడుపుతారన్నారని రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. మరోవైపు, ఎన్డీయే 400 సీట్లను దాటుతోందని భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా విశ్లేషకులు చెబుతున్నారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నాయకుడు అంటే ఇచ్చిన హామీలు పూర్తి చేసేవాడని గుర్తు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..