Tripura: దారుణం..! బాకీ డబ్బులు చెల్లిస్తేనే టీ పోస్తానన్న చాయ్‌వాలా.. ఇటుకతో కొట్టి చంపిన యువకుడు
త్రిపురలోని అగర్తలాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు టీ దుకాణదారుడిని ఇటుకతో కొట్టి దారుణంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడిని సుఖేన్ దాస్‌గా గుర్తించిన పోలీసులు, నిందితుడు దీపాంకర్ సేన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఈస్ట్ అగర్తల పోలీస్ స్టేషన్ పరిధిలో దీపాంకర్ సేన్, సుఖేన్ ఒకరికొకరు పొరుగువారు. మే 16న దీపాంకర్ టీ తాగేందుకు సుఖేన్ దుకాణానికి వెళ్లాడు. అప్పుడు దీపాంకర్ టీ, సిగరెట్ తీసుకున్నాడు. దానికి సుఖేన్ డబ్బు అడగడంతో అతను దానిని ఇవ్వడానికి నిరాకరించాడు. బాకీ కింద రాసుకోమంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే మే 18న దీపాంకర్ మళ్లీ సుఖేన్ దుకాణానికి వెళ్లాడు. టీ, సిగరెట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ముందుగా పాత బకాయిలు చెల్లించాలని సుఖేన్ దాస్ నిరాకరించారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంతలో దీపాంకర్ సుఖేన్‌పై ఇటుకతో దాడి చేశాడు. ఈ గొడవలో సుఖేన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అగర్తలలోని జీబీపీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్సపొందుతూ సుఖేన్ ప్రాణాలు విడిచాడు.
అనంతరం సుఖేన్ దాస్ భార్య బితి దాస్ అగర్తల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బిత్తిదాస్ డిమాండ్ చేశారు. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా లేక, ఇంటి ఖర్చులు దుకాణం ద్వారానే వచ్చేది. భర్త చనిపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని గోడు వెళ్ళబోసుకుంది బిత్తిదాస్. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని, నిందితుడు దీపాంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…