AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeys: వామ్మో.. 30 రోజుల్లో 11 వందల క్వింటాళ్ల చక్కెర తినేసిన కోతులు.. ఎక్కడంటే!

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కోతులు ఒక్క నెల రోజుల్లోనే రూ.35 లక్షల విలువైన చక్కెరను మాయం చేశాయి. ఈ మేరకు ఓ మిల్లు అధికారులు ఆడిట్‌ రిపోర్టు తయారు చేశారు. అలీఘర్‌లో ఉన్న బందర్ సాథ షుగర్ మిల్లులో 30 రోజుల్లోనే రూ.35 లక్షల విలువైన 11 వందల క్వింటాళ్లకు పైగా చక్కెర కనపించకుండా పోయింది. దీంతో కోతులు ఆ చక్కెర మొత్తం తినేశాయని ది కిసాన్ సహకరి షుగర్ మిల్స్ లిమిటెడ్ ఆడిట్ నివేదికలో..

Monkeys: వామ్మో.. 30 రోజుల్లో 11 వందల క్వింటాళ్ల చక్కెర తినేసిన కోతులు.. ఎక్కడంటే!
Monkeys
Srilakshmi C
|

Updated on: May 23, 2024 | 12:29 PM

Share

అలీఘర్‌, మే 23: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కోతులు ఒక్క నెల రోజుల్లోనే రూ.35 లక్షల విలువైన చక్కెరను మాయం చేశాయి. ఈ మేరకు ఓ మిల్లు అధికారులు ఆడిట్‌ రిపోర్టు తయారు చేశారు. అలీఘర్‌లో ఉన్న బందర్ సాథ షుగర్ మిల్లులో 30 రోజుల్లోనే రూ.35 లక్షల విలువైన 11 వందల క్వింటాళ్లకు పైగా చక్కెర కనపించకుండా పోయింది. దీంతో కోతులు ఆ చక్కెర మొత్తం తినేశాయని ది కిసాన్ సహకరి షుగర్ మిల్స్ లిమిటెడ్ ఆడిట్ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఈ ఘరనా మోసంలో మేనేజర్, అకౌంట్స్ అధికారి సహా ఆరుగురిని దోషులుగా నిర్ధారించారు. ఇంత పెద్ద మొత్తంలో చక్కెరను కోతులు తినడం, వర్షం కారణంగా చెడిపోవడం అనే సాకులతో పెద్ద మొత్తంలో చక్కెర కుంభకోణాన్ని తెరలేపారు. ఆడిట్ నివేదికలో పేర్కొన్న వారి నుండి డబ్బును రికవరీ చేస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు.

కాగా ఇటీవల ది కిసాన్ కోఆపరేటివ్ షుగర్ మిల్ లిమిటెడ్‌ను జిల్లా ఆడిట్ అధికారి, సహకార సంఘాలు, పంచాయతీ ఆడిట్ అధికారులు ఆడిట్ చేశారు. ఆడిట్ సందర్భంగా మార్చి 31 2024 వరకు సాథా షుగర్ మిల్లు క్లోజింగ్ స్టాక్‌ను పరిశీలించారు. నివేదిక ప్రకారం, చక్కెర నిల్వలు ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 2023 వరకు లెక్కలు సరిపోయాయి. దీని తర్వాత 2024 ఫిబ్రవరిలో చక్కెర నిల్వ 1538.37 క్వింటాళ్లు కాగా, ఆ తర్వాత నెలలో కేవలం 401.37 క్వింటాళ్లు మాత్రమే ఉన్నట్లు లెక్కల్లో చూపారు. కోతులు, అధిక వర్షం కారణంగా 1137 క్వింటాళ్ల పంచదార పాడైందని ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. పైగా మార్చి నెల స్టాక్ అసలు లెక్కల్లో చూపలేదు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

క్వింటా షుగర్‌ ప్రస్తుత మార్కెట్ ధర రూ.3100. ఆ ప్రకారం మొత్తం 1137 క్వింటాళ్ల చక్కెరపై సంస్థకు రూ.35 లక్షల 24 వేల 700 నష్టం వాటిల్లిందని సహకార సంఘాల అసిస్టెంట్ ఆడిట్ అధికారి వినోద్ కుమార్ సింగ్ నివేదికలో తెలిపారు. దీనికి ప్రిన్సిపల్ మేనేజర్ రాహుల్ యాదవ్, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఓంప్రకాష్ ఓంప్రకాష్, కెమికల్స్ మేనేజర్ వినోద్ ఎంకే శర్మ, అకౌంటెంట్ మహిపాల్ సింగ్, ఇన్‌ఛార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ దల్వీర్ సింగ్, వేర్‌హౌస్ కీపర్ గులాబ్ సింగ్ బాధ్యులుగా తేల్చారు. వీరి నుంచి డబ్బు రికవరీ చేసి, ఆడిట్ నివేదికను లక్నోలోని చెరకు కమిషనర్, డిప్యూటీ డైరెక్టర్ షుగర్ మిల్స్ అసోసియేషన్‌కు దర్యాప్తు అధికారులు పంపనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి