పుష్ప రేంజ్ స్టోరీ.. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ వాసుది.. వెలుగులోకి నమ్మలేని నిజాలు..

కూలికి పోతే కానీ పూట గడవని కుంటుంబం అతనిది.. పూరింట్లో నివాసం.. కానీ ఇప్పుడు కోట్లు ఆర్జించాడు. అరె.. భలే స్పూర్తి పొందే స్టోరీ అనుకోకండి. అతని మార్గాన్ని అనుసరిస్తే మీరు కూడా ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. అవును.. అతను ఈజీ మనీ కోసం బెట్టింగ్ దందాలకు పాల్పడ్డాడు. డ్రగ్స్ పెడ్లర్స్‌తో చేతులకు కలిపాడు. కోట్లకు పడగలెత్తాడు. వెయ్యి గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకి కుప్పకూలినట్లు.. ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీతో అడ్డంగా బుక్కయ్యాడు.

పుష్ప రేంజ్ స్టోరీ.. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ వాసుది.. వెలుగులోకి నమ్మలేని నిజాలు..
Rave Party Vasu
Follow us

| Edited By: Srikar T

Updated on: May 23, 2024 | 4:18 PM

కూలికి పోతే కానీ పూట గడవని కుంటుంబం అతనిది.. పూరింట్లో నివాసం.. కానీ ఇప్పుడు కోట్లు ఆర్జించాడు. అరె.. భలే స్పూర్తి పొందే స్టోరీ అనుకోకండి. అతని మార్గాన్ని అనుసరిస్తే మీరు కూడా ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. అవును.. అతను ఈజీ మనీ కోసం బెట్టింగ్ దందాలకు పాల్పడ్డాడు. డ్రగ్స్ పెడ్లర్స్‌తో చేతులకు కలిపాడు. కోట్లకు పడగలెత్తాడు. వెయ్యి గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకి కుప్పకూలినట్లు.. ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీతో అడ్డంగా బుక్కయ్యాడు.

ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న బెంగళూరు రేవ్‌ పార్టీ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు లంకపల్లి వాసు గురించి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోని వస్తున్నాయి. విజయవాడ బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసుది పేద కుటుంబం. తండ్రి చనిపోగా.. తల్లి దోసెలు వేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. వాసుకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌లో రాణించాలని కలలుకన్నాడు వాసు. అందుకే ఆటను అవపోసన పట్టాడు. ఆ కళ అతడిని బుకీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలాంటి గేమ్స్ అన్నింటిలో బుకీగా తన హస్తవాసి ప్రదర్శించాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో తన నెట్వర్క్ విస్తరించాడు. అనంతరం పలు రాష్ట్రాలకు కూడా తన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతడి పనులు చేసి పెట్టేందుకు బెజవాడలో 150 మంది సిబ్బంది ఉన్నారంటే మాటలా. ఆపై పబ్ వ్యాపారంలోకి దిగి.. తన పరిధిని మరింత పెంచుకుంటున్నారు. వాసు భార్య, ఇద్దరు కుమార్తెలు విజయవాడలోనే నివాసం ఉంటారు. అతను మాత్రం నెలకు ఒకటి, రెండు రోజులు వచ్చి వెళ్తాడు. ఎవరైనా అడిగితే విదేశాల్లో జాబ్ చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవాడు.

అతను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఫ్లైట్ ఎక్కాల్సిందే. టైం అతనికి అంత ఇంపార్టెంట్. వాసుకు రూ.కోటి విలువైన లగ్జరీ కార్లు నాలుగు వరకు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో విల్లాలు, ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. ముంబైలో ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకుని.. తను బెట్టింగ్ నెట్‌వర్క్‌ను రన్ చేస్తున్నారు. విజయవాడలో అతని మనుషులు పట్టుబడినా తన ఇన్‌ప్లూయెన్స్ వాడి బయటకు తీసుకొచ్చేశాడు. బెంగళూరు రేవ్‌పార్టీలో తప్పితే.. ఇంతవరకు ఎక్కడా పోలీసులకు చిక్కలేదు. అయితే అతనికి పలు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. గుండెకు స్టంట్ వేసినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles