AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komatireddy Venkat Reddy: కేటీఆర్ కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదు.. ఆయన పేరు చెప్పాలంటేనే ఇన్సల్ట్‌గా ఉంది

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయని.. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు, 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకు.. కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిడుతున్నారా..? అంటూ మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. దర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి కట్టి అబివృద్ధి చేసామని చెప్తున్నారు.. ఎయిర్పోర్ట్, పీవి ఎక్స్ ప్రెస్ వే లాంటివి కట్టిన తాము ఏమనాలి అంటూ పేర్కొన్నారు.

Komatireddy Venkat Reddy: కేటీఆర్ కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదు.. ఆయన పేరు చెప్పాలంటేనే ఇన్సల్ట్‌గా ఉంది
Komatireddy Venkat Reddy
Shaik Madar Saheb
|

Updated on: May 23, 2024 | 12:57 PM

Share

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది.. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ నేతలు అంతా అటు ఇటు తిరగాల్సిందే.. అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కవిత జైలు కు వెళ్లిందని, తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్‌లో కేటీఆర్ ఉన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయని.. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు, 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకు.. కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిడుతున్నారా..? అంటూ మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. దర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి కట్టి అబివృద్ధి చేసామని చెప్తున్నారు.. ఎయిర్పోర్ట్, పీవి ఎక్స్ ప్రెస్ వే లాంటివి కట్టిన తాము ఏమనాలి అంటూ పేర్కొన్నారు.

ఐఎఎస్‌లను అందరినీ పక్కన పెట్టి నలుగురు ఐఎఎస్ లను కేటీఆర్ ఎంకరేజ్ చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఉద్యమకారుడు కేకే మహెందర్ రెడ్డి ని బీఆర్ఎస్ నుంచి వెల్లగొట్టిందే కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 12 కు తగ్గకుండా కాంగ్రెస్ కు ఎంపీ స్థానాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్‌కు రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువ అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.

బీఆర్ఎస్ హాయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. వైన్ షాపుల పేరు మీద 2500 కోట్లు గత ప్రభుత్వం రాబట్టిందని.. టెట్ కు 2 వేలు పెడితే కేటీఆర్ తమను విమర్శిస్తున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పాం.. దోడ్డు వడ్లకు ఇవ్వమని తాము ఎక్కడా చెప్పలేదన్నారు.

వచ్చే నెల 6,7,8న తానూ.. శ్రీధర్ బాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నామని.. వివిధ కంపెనీలతో భేటి అవుతామని మంత్రి తెలిపారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని.. తాము ఇతర రాష్ట్రాలకు వెల్లలేకపోతున్నామంటూ పేర్కొన్నారు. ఎల్బీనగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 14 అంతస్థులకు కుదిస్తామని మంత్రి పేర్కొన్నారు.

మల్లన్న మీద కేసులు ఉన్నాయంటున్న కేటీఆర్.. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఫోర్ లీడర్ అయి నెల రోజులు కానీ వ్యక్తి.. ఆర్టీఐ కింద 70 లెటర్లు పెట్టారన్నారు. సీనియర్ నేత రాజాసింగ్ కు కాదని ఎల్పీ పదవి తీసుకున్నారని.. ఆయన పేరు చెప్పాలంటేనే తనకు ఇన్సల్ట్ గా ఉందన్నారు. సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. మండిపడ్డారు.

ఎటువంటి పర్మిషన్ లేకుండానే బీఆర్ఎస్ ఆఫీసులు కట్టారని కోమటిరెడ్డి అన్నారు. వైఎస్సార్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..