AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పారిశుధ్య కార్మికురాలిపై మున్సిపాలిటీ శానిటేషన్‌ ఫీల్డ్ అసిస్టెంట్ అఘాయిత్యం.. వీడియో తీసి పైశాచిక ఆనందం..!

కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ అధికారి బరితెగించాడు.. ఒళ్ళు మరిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా వీడియో రికార్డు చేసి, వేధింపులకు పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన బల్దియా పరిధిలోని గాజులరామారంలో వెలుగు చూసింది. సర్కిల్‌లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కిషన్‌.. తన కింద పని చేసే ఓ పారిశుధ్య కార్మికురాలిపై కన్నేశాడు

Hyderabad: పారిశుధ్య కార్మికురాలిపై మున్సిపాలిటీ శానిటేషన్‌ ఫీల్డ్ అసిస్టెంట్ అఘాయిత్యం.. వీడియో తీసి పైశాచిక ఆనందం..!
Municipal Sanitation Field Assistant Kishan
Balaraju Goud
|

Updated on: May 23, 2024 | 11:04 AM

Share

కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ అధికారి బరితెగించాడు.. ఒళ్ళు మరిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా వీడియో రికార్డు చేసి, వేధింపులకు పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన బల్దియా పరిధిలోని గాజులరామారంలో వెలుగు చూసింది. సర్కిల్‌లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కిషన్‌.. తన కింద పని చేసే ఓ పారిశుధ్య కార్మికురాలిపై కన్నేశాడు. తాను చెప్పినట్లు వినాలని ఆమెను బెదిరించాడు. అంతేకాదు విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టాడు. అధికారి వేధింపులు భరించలేక నరకయాతన అనుభవిస్తున్న కార్మికురాలు అతని చెరలో పడక తప్పలేదు. రోజు పనికి వచ్చిన ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా ఈ తతంగమంతా తన ఫోన్‌లో రికార్డు చేసి.. అవి మళ్లీ మళ్లీ చూస్తూ నేత్రానందం పొందాడు కిషన్‌.

ఈ క్రమంలో కిషన్‌ లైంగిక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తోటి కార్మికుల ఫోన్‌లో కూడా వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ చూసిన కార్మికులు ఏంటని ప్రశ్నించారు. దీంతో ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్క కార్మికుడికి 10వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి వారి నోరు మూయించాడు కామాంధుడు కిషన్‌. కూకట్‌పల్లి మహిళ ఐఏఎస్ అధికారిణి జోనల్ కమిషనర్ ఉన్న చోట ఈ దారుణం వెలుగు చూసింది. ఆమె పరిధిలో పని చేస్తున్న ఓ మహిళా పారిశుధ్య కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డురంగా ఉందని మహళా కార్మికులు అంటున్నారు. ఈ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో చూసిన చాలా మంది GHMC ఉన్నతాధికారులు కూడా కామాందుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డూరం..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి