Telangana: తెలంగాణ ఆర్టీసీ లోగో మారిందా.? క్లారిటీ ఇచ్చిన సజ్జనార్‌..

ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే అధికారిక సంక్షిప్త పదం టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఇటీవల సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో రాష్ట్రాన్ని టీజీగా పేర్కొనాలని సూచించారు...

Telangana: తెలంగాణ ఆర్టీసీ లోగో మారిందా.? క్లారిటీ ఇచ్చిన సజ్జనార్‌..
Sajjanar
Follow us

|

Updated on: May 23, 2024 | 10:15 AM

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని కేంద్రం సైతం అంగీకరించింది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. ఈ మార్పులతో తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారు.

ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే అధికారిక సంక్షిప్త పదం టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఇటీవల సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో రాష్ట్రాన్ని టీజీగా పేర్కొనాలని సూచించారు. జీవోలు, పాలసీ పేపర్లు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, లెటర్‌ హెడ్స్‌, అధికారిక పత్రాల్లో సైతం టీజీ అని వచ్చేలా చూడాలన్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీని టీఎస్‌ఆర్టీసీగా పిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం టీజీగా మార్చడంతో టీఎస్‌ఆర్టీసీ కూడా టీజీ ఆర్టీసీగా మారుతుందని వార్తలు వచ్చాయి. ఇక ఆర్టీసీ లోగో కూడా మారిపోయిందంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వైరల్‌ అయ్యాయి. మారిన లోగో ఇదేనంటూ కొన్ని ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే దీంట్లో ఏ మాత్రం నిజం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ క్లారిటీ ఇచ్చారు. లోగో మార్పుపై జరుగుతోన్న ప్రచారానికి సంబంధించి ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

సజ్జనార్ ట్వీట్..

ఈ విషయమై సజ్జనార్‌ ట్వీట్ చేస్తూ.. ‘TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్‌. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!