Hyderabad: వేడిగా సర్వ్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటున్నారా..? పోయే కాలం దగ్గర్లోనే

వీకెండ్‌ వస్తే ఫుడ్‌ బయటే లాగించేస్తున్నారా...? స్పెషల్ డే అంటూ పరిగెత్తుకుని వెళ్లి పేరుమోపిన రెస్టారెంట్స్‌లో వాలిపోతున్నారా...? ఫ్యామిలీని తీసుకుని వెళ్లి మరి ఎంచక్కా ఆరగిస్తున్నారా...? బీ అలర్ట్‌. నగరంలోని పెద్ద రెస్టారెంట్లు సైతం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి.

Hyderabad: వేడిగా సర్వ్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటున్నారా..? పోయే కాలం దగ్గర్లోనే
Hyderabad Hotels
Follow us
Ram Naramaneni

|

Updated on: May 23, 2024 | 9:23 AM

వీకెండ్ వస్తే హైదరాబాదీలు రెస్టారెంట్ల మీద పడిపోతారు. లంచ్, డిన్నర్ అన్నీ హోటళ్లలోనే కానిచ్చేస్తారు. రకరకాల పేర్లతో ఉన్న రెస్టారెంట్స్‌కు వెళ్లి అన్నీ ఫ్లేవర్స్‌ కవర్ చేస్తారు. ఇలా బయట తినే హైదరాబాదీలు అలర్ట్‌ అవ్వాల్సిన టైమ్‌ వచ్చింది. పెద్దపెద్ద హోటల్స్‌, రెస్టారెంట్స్‌లోనూ నాణ్యతలేని ఫుడ్ వండి వార్చుతున్నట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బయట తినే ముందు బీ అలర్ట్‌ అంటూ హెచ్చరిస్తున్నారు.

గతకొన్ని రోజులుగా నగరంలో ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ ఫోర్స్‌ బృందం ప్రముఖ హోటల్స్‌ అండ్ రెస్టారెంట్స్‌లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు హోటళ్లను సీజ్‌ చేసిన అధికారులు… లేటెస్ట్‌గా నాణ్యతలేని ఫుడ్‌ పెడుతున్న 24 పెద్ద రెస్టారెంట్స్‌ను గుర్తించారు. వాటిలోని ఆహార పదార్ధాల టెస్ట్‌ చేసేందుకు శాంపుల్స్‌ను నాచారం ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్ట్స్‌ ఆధారంగానే కల్తీ ఫుడ్‌ పెడుతున్న రెస్టారెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అలాగే స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్మే ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రమైన స్థలంలో, కల్తీ లేని ఆహారం విక్రయించాలంటూ వారికి అవగాహన కల్పించారు.

మొత్తంగా… నగరవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్స్‌పై గతకొన్నాళ్ల నుంచి ముమ్మర తనిఖీలు చేపట్టారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. ముగ్గురు సభ్యులతో కూడిన టీమ్‌… ఇప్పటికే వందల సంఖ్యలో హోటల్లను విజిట్‌ చేసింది. చాలా చోట్ల రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన గడువు ముగిసిన సరుకులను వంట కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది. హ్యాండ్ గ్లోవ్స్, హెయిర్ క్యాప్స్, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అక్కడి పరిస్థితులను బట్టి కనుగొన్నది. నాణ్యతా ప్రమాణాలు పాటించని పలు హోటళ్లను సీజ్‌ చేసింది. ఐస్‌క్రీమ్‌ పార్లర్లు, బేకరీల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..