Hyderabad Water: హైదరబాద్‌కు తప్పనున్న నీటి‌గండం.. భగీరథ ప్రయత్నం సక్సెస్ అయితే జులై వరకు డోకా లేదు..!

రాష్ట్ర రాజధాని హైదరబాద్ తాగునీటి గండాన్ని గట్టెక్కించేందుకు ఎల్లంపల్లి జలాశయ అదికారులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. మంచిర్యాల‌, పెద్దపల్లి జిల్లాల నడుమ గోదావరిపై నిర్మాణమైన ఎల్లంపల్లి మండుతున్న ఎండలతో ఎండి ఎడారిలా మారుతుండటంతో.. ఇన్‌టెక్ కాల్వలకు నీరొచ్చే అవకాశం లేకపోయింది. దీంతో అదనంగా మోటర్లను‌ ఏర్పాటు‌ చేసి‌ కాల్వల్లోకి నీటిని‌ ఎత్తిపోసేందుకు‌ సిద్దమవుతున్నారు.

Hyderabad Water: హైదరబాద్‌కు తప్పనున్న నీటి‌గండం.. భగీరథ ప్రయత్నం సక్సెస్ అయితే జులై వరకు డోకా లేదు..!
Yellampalli Project
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: May 23, 2024 | 12:21 PM

రాష్ట్ర రాజధాని హైదరబాద్ తాగునీటి గండాన్ని గట్టెక్కించేందుకు ఎల్లంపల్లి జలాశయ అదికారులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. మంచిర్యాల‌, పెద్దపల్లి జిల్లాల నడుమ గోదావరిపై నిర్మాణమైన ఎల్లంపల్లి మండుతున్న ఎండలతో ఎండి ఎడారిలా మారుతుండటంతో.. ఇన్‌టెక్ కాల్వలకు నీరొచ్చే అవకాశం లేకపోయింది. దీంతో అదనంగా మోటర్లను‌ ఏర్పాటు‌ చేసి‌ కాల్వల్లోకి నీటిని‌ ఎత్తిపోసేందుకు‌ సిద్దమవుతున్నారు. ఈ భగీరథ ప్రయత్నం సక్సెస్ అయితే అబ్దుల్‌ కలాం సుజల స్రవంతి పథకంలో భాగమైన బ్రహ్మణపల్లి పంప్ హౌజ్ నుండి రాష్ట్ర రాజధానికి వర్షకాలం వరకు నీటి సరపరా కు డోకా లేనట్లే అంటున్నారు అధికారులు.

ఎల్లంపల్లి ఎన్నడూ లేనంతగా అడుగంటి పోయి ఎడారిలా మారి తల్లడిల్లుతోంది. మండుతున్న ఎండలతో అడుగంటుతున్న ఎల్లంపల్లి 2016లో ఏర్పడిన తాగినీటి కష్టాలను పునారావృతం చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 148 అడుగులకు గాను 140.5 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉండటం.. 20 టీఎంసీలకు‌ గాను 5.5 టీఎంసీల‌ నీరు మాత్రమే జలాశయంలో నిల్వ ఉండటంతో డెడ్ స్టోరేజీకి సమీపంలోకి వచ్చి చేరింది. భానుడి భగభగలతో రోజుకు 160 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా.. 331 క్యూసెక్కుల నీరు హైదరబాద్ కు తాగునీటి అవసరాల కోసం ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీరు బ్రహ్మణపల్లి పంప్ హౌజ్ నుండి సరపరా అవుతోంది.

అయితే బ్రహ్మణపల్లి పంప్ హౌజ్‌కు‌ నీళ్లు చేర్చే ఇన్ టెక్ కాల్వకు సమీపంలో ఎల్లంపల్లి జలాశయ మట్టం 138.5 అడుగులకు పడిపోవడంతో పంప్ హౌజ్ కు నీరు చేరడం గగనమైంది. దీంతో అలర్ట్ అయిన హెచ్ఎండబ్ల్యుఎస్ అధికారులు ఎల్లంపల్లి జలాశయంలో వార్ జోన్ ను ఏర్పాటు చేసి, 120 హెచ్ పీ సామర్ధ్యం ఉన్న 20 మోటర్ల ను యుద్ద ప్రాతిపదికన‌ బిగించి తాగునీటి కష్టాలకు చెక్ పెట్టే ప్రయత్నం మొదలు పెట్టారు.

ఉదయం ఎర్రని ఎండలు.. సాయంత్రం ఒక్కసారిగా చల్లగా మారి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నా.. భగీరథ ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదు సిబ్బంది. అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకం ద్వారా హైదరబాద్ మెట్రోపాలిటిన్ సిటీకి నీరందించే ప్రయత్నం చేస్తున్నారు బ్రహ్మణపల్లి పంప్ హౌజ్ అధికారులు. పంప్ హౌజ్ ఇంఛార్జ్ సతీష్ ఆద్వర్యంలో జలాశయంలో ఎత్తిపోతల ద్వారా నీటిని కాల్వలోకి తరలించదుకు మోటర్లను బిగించే భగీరథ యత్నం చకాచకా సాగుతోంది. 25 సబ్మెర్సిబుల్ పంపులను నదిలో ఏర్పాటుచేసి అప్రోచ్ కాలువలోకి ఎత్తిపోయనున్నారు. జులై చివరి వారం నాటికి ఈ ప్రాజెక్టుకు ఇన్ఫో ప్రారంభమవుతుంది. అప్పటి వరకు అప్రోచ్ కాలువలోకి నీటి ఎత్తిపోత తప్పనిసరని బ్రహ్మణపల్లి పంప్ హౌజ్ అధికారులు చెప్తున్నారు.

2016 లో ఇదే పరిస్థితి ఎదురవడంతో ఆ ఏడాది 16 మోటర్లను నదిలో బిగించి ఇన్ టెక్ కాల్వలోకి ఎల్లంపల్లి‌ జలాలను ఎత్తిపోశారు. ఈ ఏడాది హైదరబాద్ తోపాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మిషన్ భగీరథకు, ఎన్టీపీసీకి అత్యవసర మంచి నీటి సరపరా కోసం 120 హెచ్ పీ సామర్థ్యం ఉన్న మరో నాలుగు అత్యాధునిక సబ్మెర్సిబుల్ పంపులను నదిలో ఏర్పాటుచేసి ఇన్ టెక్ కాల్వలన నింపే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు .

ప్రస్తుతం ఎల్లంపల్లి ఇన్‌టెక్ వెల్ వద్ద 138 మీటర్ల మట్టం వద్ద నీళ్లు ఉండగా… భగీరథ ప్రయత్నంతో అప్రోచ్ కాలువల లోతును పెంచి ఇన్ టెక్ వెల్ లోకి నీరు వచ్చేలా భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా మంచిర్యాల జిల్లాలోని తొమ్మిది మండలాలకు తాగు నీరందించే మిషన్ భగీరథ ఇన్ టెక్ వెల్ లను 140 మీటర్ల మట్టం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అందుకోసం జేసీబీల సాయంతో కాల్వలలను తవ్వించి గోదావరిలోని నీటిని పంప్ హౌజ్ లోకి మళ్లించే భగీరథ యత్నం చేస్తున్నారు ఎల్లంపల్లి అదికారులు.

ఈ భగీరథ ప్రయత్నం సక్సెస్ అయితే వర్షకాలం ప్రారంభం వరకు ఇటు మంచిర్యాల జిల్లాకు తాగు నీటి గండం తప్పినట్టే.. అటు బ్రహ్మణపల్లి పంప్ హౌజ్ వద్ద సబ్ మెర్సిబుల్ పంపుల బిగింపు పూర్తయితే.. 140 అడుగులున్న గోదావరి నది గర్బం నుంటి పంప్ హౌజ్ అప్రోచ్ కాల్వలోకి నీరు ఎత్తిపోయడం షురూ అయితే రాష్ట్ర రాజదాని హైదరబాద్ జులై మొదటి వారం వరకు నిరంతరాయంగా తాగునీటి సరపరా చేసే అవకాశం ఉంటుంది. ఆలోగా అకాల వర్షాలతో ఒక్క టీఎంసీ వాటర్ వరద రూపంలో జలాశయంలోకి వచ్చినా తాగునీటి గండాన్ని ఈ ఏడాది గట్టెక్కినంటే అంటున్నారు ఎల్లంపల్లి అదికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..