Telangana Formation Day: సోనియాకు ఆహ్వానంపై రాజకీయ ప్రకంపనలు.. కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ ఫైర్..
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా వస్తారా? రారా? అంతకంటే ముందే ఈ అంశం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సోనియా ఆహ్వానాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణ దేవత అయిన సోనియాను ఎందుకు ఆహ్వానించకూడదని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నేతలు.. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా వస్తారా? రారా? అంతకంటే ముందే ఈ అంశం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సోనియా ఆహ్వానాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణ దేవత అయిన సోనియాను ఎందుకు ఆహ్వానించకూడదని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నేతలు.. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజుల క్రితం జరిగిన భేటీలో కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశం ఇప్పుడు గల్లీ టు ఢిల్లీ చర్చనీయాంశంగా మారింది. సోనియాను ఆహ్వానించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్న నిర్ణయాన్ని కమలనాథులు తప్పుబడుతూనే, సోనియాను పిలవడం ఏంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు సోనియాను ఏ హోదాలో ఆహ్వానిస్తారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1500 మందిని బలి తీసుకున్నందుకు సోనియాను ఆహ్వానించి సన్మానిస్తారా అని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా? అంటున్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ కార్యక్రమమే అయితే పార్టీ అధినేతను ఎలా ఆహ్వానిస్తారు? పార్టీ కార్యక్రమం అయితే గాంధీ భవన్‌లో ఘనంగా సన్మానించుకోవచ్చు అంటూ సెటైర్లు వేశారు కిషన్ రెడ్డి..
అయితే కమలనాథులను కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. సోనియా తెలంగాణ ఇచ్చిన దేవత అంటూ ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటునే ప్రధాని మోదీ అవమానించారన్న కాంగ్రెస్ నేతలు.. మోదీ నాయకత్వంలో పనిచేస్తే ఇలానే మాట్లాడుతారని కిషన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శిస్తున్నారు. సోనియా రాకను తప్పుబడుతున్నారంటే బీజేపీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్..
ఇదంతా ఇలా ఉంటే ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ చివరి ఏడాదే ఉత్సవాలు నిర్వహించారు, మళ్లీ ప్రత్యేకంగా జరపడం ఎందుకు ప్రశ్నించారు ఆ పార్టీ నేత బూర నర్సయ్య గౌడ్. ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీకి నిధులు లేవు కాని ఉత్సవాలకు ఉన్నాయా అని ప్రశ్నించారు.
వీడియో చూడండి..
వేడుకలకు పది రోజుల ముందే మొదలైన ఈ వివాదం టైమ్ దగ్గర పడుతున్నా కొద్దీ ఇంకా ఎలాంటి రాజకీయ వివాదాలకు దారితీస్తోందో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..