Hyderabad: కాసుల కక్కుర్తితో కన్న బిడ్డనే కాదనుకున్నారు.. స్ట్రింగ్ ఆపరేషన్​‌లో బయటపడ్డ విస్తుపోయే వాస్తవాలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులో రెండు నెలల చిన్నారిని అమ్మకాని పెట్టిన ఘటన కలకలం రేపుతుంది. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి వెలుగులోకి తెచ్చారు. దీంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: కాసుల కక్కుర్తితో కన్న బిడ్డనే కాదనుకున్నారు.. స్ట్రింగ్ ఆపరేషన్​‌లో బయటపడ్డ విస్తుపోయే వాస్తవాలు
Baby Child
Follow us
Balaraju Goud

|

Updated on: May 23, 2024 | 8:20 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులో రెండు నెలల చిన్నారిని అమ్మకాని పెట్టిన ఘటన కలకలం రేపుతుంది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

మేడ్చల్ జిల్లా లో అమానుష ఘటన జరిగింది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 60రోజుల ఆడ శిశువుని అమ్మకానికి పెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి వెలుగులోకి తెచ్చారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణనగర్‌లో ఉన్న శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ వేదికగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆర్ఎంపీ వైద్యురాలు శోభారాణిని 60 రోజుల ఆడ శిశువును రూ. 4.50 లక్షలకు ఇప్పిస్తానని ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ముందుగా రూ. 10 వేలు అడ్వాన్స్‌గా తీసుకుంది.

ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం పాప కోసం NGO సభ్యులు క్లినిక్‌కు వచ్చారు. ఓ మహిళ అక్కడకు వచ్చి ఓ పాపను అప్పగించింది. NGO ప్రతినిధులు ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించారు. ఫౌండేషన్ ప్రతినిధులు ఇచ్చిన సమాచారంపై రంగంలోకి దిగిన పోలీసులు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను పోషించడం కష్టంగా ఉందని ఆ పసికందు తల్లి చెప్పడంతో పిల్లలు లేనివారికి అమ్మినట్లుగా దర్యాప్తులో శోభారాణి అంగీకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పాపను శిశువిహార్‌కి తరలించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…