‘Remal’ Cyclone: బంగాళాఖాతంపై కొనసాగుతున్న అల్పపీడనం.. రేపటికి వాయుగుండం.. తర్వాత తుఫాన్‌గా మార్పు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దాని తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రేపటికి వాయుగుండం గాను ఆ తర్వాత తీవ్రవాయుగండం గాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుంది.

‘Remal’ Cyclone: బంగాళాఖాతంపై కొనసాగుతున్న అల్పపీడనం.. రేపటికి వాయుగుండం.. తర్వాత తుఫాన్‌గా మార్పు!
‘remal’ Cyclone
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 23, 2024 | 2:36 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దాని తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రేపటికి వాయుగుండం గాను ఆ తర్వాత తీవ్రవాయుగండం గాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుంది.

తుఫాన్‌గా మారితే ఒమన్ దేశం సూచించిన ‘రెమాల్’ గా నామకరణం చేస్తారు. ప్రస్తుతానికి ఈశాన్య దిశగా కదులుతుంది అల్పపీడనం. సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ప్రభావం ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం అంతా మధ్య బంగాళాఖాతంలోనే ఎక్కువ. ఆ ప్రాంతంలోనే ఎక్కువ వర్షపాతం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తేలిక పాటి వర్షాలకురుస్తాయని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద. వాతావరణ శాఖ అధికారులు. భూభాగం పైనుంచి ఏపీ వైపు గాలుల్లో వేస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలకు క్రమంగా పెరుగుతున్నాయని అంటున్నారు.

ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడురోజులపాటు అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతుంది.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కేరళ, తమిళణాడు పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. మే 31న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే కొందరు నిపుణులు ఒకరోజు ముందు అంటే 30వ తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
ఫ్యాషన్ షోలో మోడల్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు..
ఫ్యాషన్ షోలో మోడల్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు..
ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు.. రికార్డులు బ్రేక్ చేసిన జోడీ
ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు.. రికార్డులు బ్రేక్ చేసిన జోడీ