AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తప్పు జరిగితే ఎక్కడికైనా వచ్చేస్తారు.. ఏకంగా ఎమర్జన్సీ వార్డులోకి దూసుకువచ్చిన పోలీస్ వాహ‌నం

లేడీ డాక్టర్‌ను వేధించిన ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సినీ ఫక్కీలో ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా ఏమర్జెన్సీ వార్డులోకి ఎస్‌యూవీని తరలించారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియోకి సంబంధించిన ఘటన..

Watch Video: తప్పు జరిగితే ఎక్కడికైనా వచ్చేస్తారు.. ఏకంగా ఎమర్జన్సీ వార్డులోకి దూసుకువచ్చిన పోలీస్ వాహ‌నం
Police Jeep
Jyothi Gadda
|

Updated on: May 23, 2024 | 7:13 PM

Share

లేడీ డాక్టర్‌ను వేధించిన ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సినీ ఫక్కీలో ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా ఏమర్జెన్సీ వార్డులోకి ఎస్‌యూవీని తరలించారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియోకి సంబంధించిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి అత్యవసర విభాగంలోకి ఎస్‌యూవీతో వచ్చారు పోలీసులు. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ వీడియోలో పోలీస్ వాహనం ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలోకి ప్రవేశించడం కనిపిస్తుంది. కొంతమంది గార్డులు ఆ కారుకు మార్గం కల్పించేందుకు రోగులను పక్కకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ రాజస్థాన్‌కు చెందిన నిందితుడు సతీష్‌కుమార్‌ను మంగళవారం థియేటర్‌లో వదిని అనే మహిళా వైద్యురాలిని వేధించాడనే ఫిర్యాదు మేరకు అతన్ని సస్పెండ్ చేసి అరెస్టు చేశారు. అతనిపై అత్యాచారం నేరం కింద, క్రిమినల్ కేసు నమోదు చేశారు. సతీష్‌కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ రెసిడెంట్‌ వైద్యులు సమ్మె చేయడంతో బుధవారం ఎయిమ్స్‌-రిషికేశ్‌ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. రెసిడెంట్ వైద్యులు, డీన్ కార్యాలయం వెలుపల గుమిగూడి నినాదాలు చేశారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ సంజీవ్‌ కుమార్‌ మిట్టల్‌ మాట్లాడుతూ నర్సింగ్‌ అధికారిని తక్షణమే సర్వీసు రద్దు చేయాలని, ఆయన చేసిన నేరానికి సస్పెన్షన్‌ చాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఎయిమ్స్ ఆసుపత్రి మహిళా డాక్టర్ ఫిర్యాదుపై నిందితుడిని అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై సతీష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విషయం తీవ్రతను గమనించి, ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కుసుమ్ కంద్వాల్ ఎయిమ్స్ పరిపాలనా బృందంతో సమావేశమయ్యారు. ఈ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై విచారణకు కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!