Beauty Tips: కొరియన్ బ్యూటీ టిప్స్‌.. అద్దం లాంటి చర్మం కోసం ఈ ఫేషియల్‌ ట్రై చేయండి.. మెరుపు ఖాయం..!

దీని కోసం చాలా మంది ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే, గాజులాంటి మెరిసే చర్మాన్ని పొందాలంటే ఖరీదైన ఉత్పత్తులను వాడకుండా.. ఇంటి ఉత్పత్తులతో తయారుచేసిన ఫేషియల్స్ ను ఉపయోగించుకోవచ్చు. కొరియన్ ఫేషియల్ ను ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. ఇవి మీకు బెస్ట్‌ రిజల్ట్స్‌ని చూపిస్తాయి.

Beauty Tips: కొరియన్ బ్యూటీ టిప్స్‌.. అద్దం లాంటి చర్మం కోసం ఈ ఫేషియల్‌ ట్రై చేయండి.. మెరుపు ఖాయం..!
Korean Glass Skin
Follow us

|

Updated on: May 23, 2024 | 3:48 PM

ముఖ సౌందర్యం కోసం చాలా మంది రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే కొరియన్ బ్యూటీ ట్రెండ్‌ ప్రజలలో మరింతగా విస్తరిస్తోంది. కొరియన్ల వంటి అందమైన చర్మం కోసం ప్రజలు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ చర్మం కొరియన్ల మాదిరి అద్దంలా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. దీని కోసం చాలా మంది ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే, గాజులాంటి మెరిసే చర్మాన్ని పొందాలంటే ఖరీదైన ఉత్పత్తులను వాడకుండా.. ఇంటి ఉత్పత్తులతో తయారుచేసిన ఫేషియల్స్ ను ఉపయోగించుకోవచ్చు. కొరియన్ ఫేషియల్ ను ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. ఇవి మీకు బెస్ట్‌ రిజల్ట్స్‌ని చూపిస్తాయి.

స్టెప్ 1: ముందుగా ఒక గిన్నెలో అవసరమైన మొత్తంలో బొప్పాయిని తీసుకుని, దానిని బాగా గుజ్జు చేయాలి. తర్వాత అందులో 2 చెంచాల పచ్చి పాలు కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ ముఖానికి బాగా పట్టించి 3 నిమిషాల పాటు మసాజ్ చేయండి. సుమారు ఒక 15-20 తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇది స్కిన్ క్లెన్సర్‌గా పనిచేసి ముఖ చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

స్టెప్ 2: మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసిన తర్వాత, ఒక గిన్నెలో బొప్పాయిని మెత్తగా చేసి, దానికి 2 స్పూన్ల తేనె కలపండి. తర్వాత ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఈ బేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

స్టెప్3: ఇప్పుడు మీ ముఖాన్ని టవల్‌తో శుభ్రం చేసిన తర్వాత మీ సాధారణ మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. మీరు కనీసం వారానికి ఒకసారి ఈ బేస్ ప్యాక్‌ని ఉపయోగిస్తే, మీరు మీ ముఖ చర్మంలో మార్పులను చూడటం ప్రారంభిస్తారు.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది. బొప్పాయిలోని పోషకాలు ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని కాపాడతాయి. మొటిమలు, చర్మ సమస్యలను దూరం చేస్తాయి. బొప్పాయిలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా మారుస్తుంది. చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది. యూవి కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

Latest Articles
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం