AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

cockroaches : ఇంట్లో బొద్దింకల బెడదా..? రాకుండా ఉండాలంటే ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..!

వంటగది ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటి సభ్యుల ఆరోగ్యం అంత బాగుంటుంది. అయితే, కొందరి వంటగదిలో బొద్దింకలు స్వైర విహారం చేస్తుంటాయి. ఎన్ని రసాయనాలు పిచికారీ చేసినా బొద్దింకలు వదిలిపెట్టవు. అటువంటి సందర్భాలలో బొద్దింకలను వదిలించుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

cockroaches : ఇంట్లో బొద్దింకల బెడదా..? రాకుండా ఉండాలంటే ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..!
Cockroaches
Jyothi Gadda
|

Updated on: May 23, 2024 | 4:26 PM

Share

ఎండ వేడిమి పెరగడంతో వంట గదిలోకి అనుకోని అతిథిలా బొద్దింకల బెడద ఎక్కువవుతోంది. అవి మీ వంటగదిని వాటి సొంత ఆవాసంగా చేసుకుంటాయి.. వంటగది అల్మారాలు, గోడ పగుళ్లు ఎక్కడ చూసినా బొద్దింకలు ఆక్రమించేస్తాయి. బొద్దింకలతో మీ వంటగది అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా వంటింట్లో ఆహారాన్ని కూడా కలుషితం చేస్తాయి. బొద్దింకలు తాకిన ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. బొద్దింకలను వదిలించుకోవడానికి మీరు ఖచ్చితంగా మార్కెట్లో లభించే రసాయన ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. అయితే అంతకు ముందు, మీ వంటగది బొద్దింకలకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారకుండా నిరోధించడానికి మీరు ఏం చేయాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

మీరు మీ వంటగదిలో శుభ్రత పాటించకపోతే బొద్దింకలు చాలా త్వరగా మీ వంటగదికి ఆకర్షితులవుతాయి. కాబట్టి బొద్దింకలను నివారించడానికి మీరు ముందుగా అల్మారాలు, డ్రాయర్లు, క్యాబినెట్‌లు, వంటగదిలోని అన్ని మూలలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో ఏదైనా గడువు ముగిసిన పదార్థాలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలి. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని సీసాలు ఉపయోగించాలి.

వంటగదిలో బొద్దింకల ముట్టడి పరిమితికి మించి ఉంటే, మీరు చేయవలసిన మొదటి పని వంటగదిని ప్రతి మూలనుంచి శుభ్రం చేసుకోవాలి. ఏ కారణం చేతనైనా వంటగదిలోని ఏ ఒక్క మూలను వదిలిపెట్టకూడదు. ఎందుకంటే చిన్న మురికికి కూడా బొద్దింకకు ఆసరాగా మారుతుంది. ఆహారం చిందినట్లయితే, బ్రెడ్ వంటి వస్తువులు చెల్లాచెదురుగా ఉంటే ఏది వదిలివేయకుండా ప్రతిదీ శుభ్రం చేయాలి. వంటగదిలో పరిశుభ్రత పాటిస్తేనే బొద్దింకలను వదిలించుకోవడం సాధ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి

వంటగదిలో పైపులు, కాలువలు, కిటికీలు మొదలైన ఏవైనా రంధ్రాలు వంటివి ఉంటే.. వెంటనే కవర్ చేయండి. మీ ఇంట్లోకి ప్రవేశించడానికి బొద్దింకలకు ఎలాంటి మార్గం లేకుండా చూసుకోండి. సింక్‌, సింక్‌ కింద హోల్‌ను జాగ్రత్తగా, క్లీన్‌గా ఉంచుకోవాలి. బొద్దింకల ముట్టడిని వదిలించుకోవడానికి మీరు సహజ పురుగుమందులను కూడా ఉపయోగించవచ్చు. పిప్పరమెంటు నూనె, వేపనూనెలో కాటన్ ముంచి వంటగది మూలల్లో ఉంచడం ద్వారా బొద్దింకలను తరిమి కొట్టవచ్చు.

అలాగే, కూరగాయలు, పండ్ల తొక్కలు, టీ పౌడర్, మిగిలిపోయిన ఆహారాలు ఉంటే..వాటిని వెంటనే క్లీన్‌ చేయండి.. చెత్త డబ్బాలు కూడా ఎప్పటికప్పడు శుభ్రం చేసి ఉంచుకోవాలి. బొద్దింకలు చెత్త వాసనకు కూడా ఆకర్షితులవుతాయని గుర్తుంచుకోండి. మరోవైపు ఎక్కడైనా నిలిచిన నీటిలో దోమలు, కీటకాలు వృద్ధి చెందుతాయని తెలిసిందే. కిచెన్ సింక్ పైపులలో చిన్న లీకేజీలు ఉన్నా వెంటనే మరమ్మతులు చేయాలి. సింక్‌లో కలుషిత నీరు ఉంటే వెంటనే శుభ్రం చేయాలి. ఆహార పదార్థాలను ఎప్పుడూ గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. దీని కోసం మీరు గాజు పాత్రలను ఉపయోగించవచ్చు. అప్పుడు బొద్దింకలు మీ ఆహార పదార్థాలను ముట్టుకోలేవు. ఈ విధంగా మీరు మీఇంట్లో నుంచి బొద్దింకలను నివారించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.