Lord Hanuman: జ్యేష్ఠమాసంలో హనుమంతుడి ఆరాధనకు ప్రాధాన్యత.. మంగళవారాలు ఎలా పూజించాలంటే..

జేష్ఠ మాసంలో వచ్చే మంగళవారలను బడ మంగళ్ అని అంటారు. ఈ మంగళ వారం రోజున ఆచారాల ప్రకారం హనుమంతుడిని పూజించడం ద్వారా ప్రజలు జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే, కోరికలన్నీ త్వరలో నెరవేరుతాయి. అటువంటి పరిస్థితిలో హనుమంతుడిని పూజించడానికి మంగళవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున హనుమంతుని ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది

Lord Hanuman: జ్యేష్ఠమాసంలో హనుమంతుడి ఆరాధనకు ప్రాధాన్యత.. మంగళవారాలు ఎలా పూజించాలంటే..
Lord Hanuman
Follow us
Surya Kala

|

Updated on: May 23, 2024 | 3:43 PM

హిందూ మతంలో సంకట మోచన హనుమంతుడిని ఆరాధించడంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తర భారత దేశంలో హిందూ నెలలను పౌర్ణమి తిది నుంచి పౌర్ణమి తిది వరకూ లెక్కిస్తారు. దక్షిణ భారత దేశంలో అమావాస్య నుంచి అమావాస్య కు హిందూ నెలలు మారతాయి. అయితే జ్యేష్ఠ మాసంలో హనుమంతుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ జేష్ఠ మాసంలో వచ్చే మంగళవారలను బడ మంగళ్ అని అంటారు. ఈ మంగళ వారం రోజున ఆచారాల ప్రకారం హనుమంతుడిని పూజించడం ద్వారా ప్రజలు జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే, కోరికలన్నీ త్వరలో నెరవేరుతాయి. అటువంటి పరిస్థితిలో హనుమంతుడిని పూజించడానికి మంగళవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున హనుమంతుని ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

మంగళ వారం రోజున ఉపవాసం ఉండి హనుమంతుడిని ఆరాధించడం ద్వారా, బజరంగబలి త్వరగా సంతోషిస్తాడని .. ప్రత్యేక ఆశీర్వాదాలను తన భక్తులపై కురిపిస్తాడని నమ్ముతారు. బడ మంగళ్ రోజున బజరంగబలిని ఆరాధించడం సాధకుడికి ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. అలాగే జీవితంలో వచ్చే సమస్యలు సులభంగా తొలగిపోతాయి. బజరంగబలి అనుగ్రహం పొందడానికి ఈ రోజున తీసుకునే చర్యలు విశేష ప్రయోజనాలను అందజేస్తాయని గ్రంధాలలో చెప్పబడింది.

జేష్ఠ మాసంలో మంగళవారం పూజ విధానం

  1. ఈ రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా ఈ పరిహారం చేయడం వల్ల త్వరగా హనుమాన్ అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. కనుక బడా మంగళ్ మహాపర్వ సందర్భంగా, బజరంగి అనుగ్రహం పొందడానికి, శరీరాన్ని, మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకుని ఎరుపు ఉన్ని ఆసనంపై కూర్చుని హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించండి.
  2. హనుమంతుడి నుంచి కోరుకున్న ఆశీర్వాదాలు పొందడానికి సింధూరం రంగు వస్త్రాన్ని, ఎరుపు రంగు పండ్లు సమర్పించండి. పండ్లను ప్రసాదంగా పంచండి.
  3. ఇవి కూడా చదవండి
  4. స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి, దేశీ నెయ్యితో చేసిన బూందీ ప్రసాదాన్ని సమర్పించండి. దీని తర్వాత సుందరకాండ పఠించండి.
  5. బడా మంగళవారం రోజున బజరంగి ప్రత్యేక ఆశీర్వాదం పొందాలనుకుంటే… హనుమంతుడి పూజలో తమలపాకులను సమర్పించండి.
  6. హిందూ మతం ప్రకారం హనుమంతుని ఆరాధనలో తమలపాకులను సమర్పించినప్పుడు, ప్రజల జీవితంలో మాధుర్యం ఎల్లప్పుడూ ఉంటుంది. జీవితంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఎటువంటి సమస్య లేకుండా పూర్తవుతాయని నమ్ముతారు.
  7. ఉద్యోగంలో జీతం పెరగాలని లేదా ప్రమోషన్ పొందాలని భావిస్తుంటే ఎవరైనా.. ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుని ఆలయానికి వెళ్లి బజరంగబలి విగ్రహం వద్దన ఉండే సింధురాన్ని తీసుకొని సీతాదేవి పాదాలకు సమర్పించండి. ఈ పని చేయడం ఆర్ధిక పురోగతికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

పూజించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి బడా మంగళ్ మహాపర్వ సందర్భంగా బజరంగ్ బలిని పూజించిన వారు ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంతేకాదు మనస్సులో ఎలాంటి తప్పుడు ఆలోచనలను చేయకూడదు. మత్తు పదార్థాలను సేవించకూడదు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం భక్తులు ఎల్లప్పుడూ వాయుపుత్రుడి విగ్రహాన్ని పూజించాలి. కాగా కొందరు ఆయన చిత్రపటానికి పూజలు చేస్తారు. ఇలా అస్సలు చేయవద్దు. అలాగే హనుమంతుడి ఛాతీని కప్పి ఉంచే ఫోటోలను అస్సలు పూజించవద్దు. మంగళవారం రోజున కోతులకు అరటిపండ్లు తినిపిస్తే బజరంగబలి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. 21 అరటిపండ్లను తీసుకొని వాటిని బజరంగబలికి సమర్పించి.. ఆపై వాటిని కోతులకు ప్రసాదంగా తినిపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు