- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips in Telugu: Tortoise ring is beneficial but know which finger to wear, know the details
Astro Tips: తాబేలు ఉంగరం ధరిస్తున్నారా..? ఏ వేలికి, ఏ విధంగా ధరిస్తే ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసా..!
మనషి ధరించే ఆభరణాలలో ఒకటి ఉంగరం. అయితే ఈ ఉంగరం అనేది ఒక రకమైన ఆభరణం అయినప్పటికీ జ్యోతిష్యశాస్త్రంలో దీనిని వివిధ రకాల పరిహారాల కోసం ఉపయోగిస్తారు. జాతకం ప్రకారం ధరించే రత్నాలను ఉంగరంలో పదిల పరుస్తారు. ఇవి అలంకారానికి మాత్రమే కాదు శుభప్రదమైనవి, గ్రహ దోష నివారణకు, అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇందు కోసం జ్యోతిషశాస్త్రం సూచించిన రత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. అయితే ఉంగరాలను రత్నాలు, రాళ్లు వివిధ రకాల పేర్లతో మాత్రమే కాదు తాబేళ్లతో కూడిన ఉంగరాలను ధరిస్తారు. ఈ నేపధ్యంలో తాబేలు ఉంగరానికి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యత .. ధరించడం వలన కలిగే లాభాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం.
Updated on: May 23, 2024 | 2:31 PM

తాబేలు లక్ష్మీదేవికి ప్రతీక అని.. అమృతం కోసం సముద్రాన్ని మథనం చేసిన సమయం తాబేలు బయటపడిందని విశ్వాసం. తాబేలు ఏ రూపంలోనైనా ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే తాబేలుని ఉంగర రూపంలో ఆభరణంగా ధరించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.

తాబేలు డిజైన్ ఉన్న ఉంగరాన్ని ధరించేటప్పుడు, దానిని సరైన మార్గంలో ధరించాలి. ఈ ఉంగరాన్ని ధరించినప్పుడల్లా, తాబేలు తలను మీ వైపుకు తోక బయటి వైపు ఉండేలా చూసుకోండి.

తాబేలు లక్ష్మి దేవితో ముడిపడి ఉన్నందున శుక్రవారం తాబేలు ఉంగరాన్ని ధరించడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మిదేవికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది.

తాబేలు ఉంగరాన్ని ఆభరణంగా ఉపయోగిస్తుంటే ఏ లోహం అయినా ఒకే. లోహపు పరిమితి లేదు, అయితే ఈ ఉంగరాన్ని లక్కీ చార్మ్‌గా ఉపయోగిస్తున్నట్లయితే.. ఇది వెండితో చేసినట్లయితే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ ఉంగరాన్ని ఏ వేలికి ధరిస్తారో చూసుకోవడం కూడా ముఖ్యం. ఈ ఉంగరాన్ని ఉంగరపు వేలికి మాత్రమే ధరించాలని గుర్తుంచుకోండి. అప్పుడే అది ప్రయోజనకరంగా మారుతుంది.

తాబేలు ఎలా నెమ్మదిగా వెళ్తూ.. తన గమ్యాన్ని చేరుకుంటుందో.. అదే విధంగా ప్రతిరోజూ నెమ్మది నెమ్మదిగా పురోగతి సాధిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. కనుక ఈ ఉంగరం వ్యక్తీ పురోగతికి ఖచ్చితంగా దోహదపడుతుందని అంటారు.



















