AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Vastu Tips: పొరపాటున కూడా లెక్కించి ఆహారం తయారు చేయవద్దు.. డబ్బు కొరతకు కారణం అవుతుంది..

కొందరికి ఆహారాన్ని తయారు చేసే ముందు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని ఎంత తింటారు అని అడగడం లేదా తినిపించేటప్పుడు లేదా తినేటప్పుడు తినే ఆహారాన్ని లెక్కించడం మీరు తరచుగా చూసే ఉంటారు. హిందూ విశ్వాసంలో ఇది అశుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా తినే ఆహారాన్ని కొలత వేసుకుని తయారు చేయడం మంచిది కాదని.. సూర్యభగవానుడి ఆగ్రహానికి కారణం అవుతుందని నమ్మకం. జీవితంలో సూర్య గ్రహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక లెక్కించి ఆహారాన్ని అరకొరగా ఎప్పుడూ తయారు చేయకూడదు.

Kitchen Vastu Tips: పొరపాటున కూడా లెక్కించి ఆహారం తయారు చేయవద్దు.. డబ్బు కొరతకు కారణం అవుతుంది..
Kitchen Vastu Tips
Surya Kala
|

Updated on: May 23, 2024 | 4:58 PM

Share

తినే ఆహారం నుంచి నిద్రించే వరకు హిందూ మతంలో కొన్ని నియమ నిబంధలున్నాయి. ఈ నియమాలను అనుసరించడం ద్వారా మనిషి తన జీవితంలో ఎల్లప్పుడూ శుభాలను, విజయాన్ని పొందుతాడు. హిందూ మతంలో వంటగది చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ తయారుచేసిన ఆహారం మనుషులు జీవితాన్ని గడపడానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఆనందం, అదృష్టాన్ని కూడా అందిస్తుంది. హిందువుల విశ్వాసం ప్రకారం ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు తినడానికి రొట్టెలు తయారు చేస్తుంటే.. ఇందుకు సంబంధించిన కొన్ని నియమాలను విస్మరిస్తే, వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

హిందూ విశ్వాసం ప్రకారం ఏకాదశి రోజున అన్నం తినరు. అదే విధంగా దీపావళి, శరత్ పూర్ణిమ, శీతాలాష్టమి, నాగపంచమిలతో పాటు ఎవరైనా మరణిస్తే ఇంట్లో ఆహరాన్ని తయారు చేయరు. ఈ నియమాన్ని విస్మరించిన కుటుంబం పై అన్నపూర్ణ దేవికి కోపం వస్తుందని నమ్మకం. వారు వారి జీవితంలో డబ్బు మరియు ఆహార కొరతను ఎదుర్కోవలసి వస్తుంది. అంతే కాకుండా ఆర్థికపరమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొందరికి ఆహారాన్ని తయారు చేసే ముందు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని ఎంత తింటారు అని అడగడం లేదా తినిపించేటప్పుడు లేదా తినేటప్పుడు తినే ఆహారాన్ని లెక్కించడం మీరు తరచుగా చూసే ఉంటారు. హిందూ విశ్వాసంలో ఇది అశుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా తినే ఆహారాన్ని కొలత వేసుకుని తయారు చేయడం మంచిది కాదని.. సూర్యభగవానుడి ఆగ్రహానికి కారణం అవుతుందని నమ్మకం. జీవితంలో సూర్య గ్రహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక లెక్కించి ఆహారాన్ని అరకొరగా ఎప్పుడూ తయారు చేయకూడదు.

ఇవి కూడా చదవండి

ముఖం ఏ దిశలో ఉండాలంటే.. వాస్తు ప్రకారం, వంటగదిలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు మతపరమైన నియమాలతో పాటు, కొన్ని వాస్తు నియమాలను కూడా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, వాస్తు ప్రకారం, మీరు ఆహారాన్ని వండే స్టవ్ ఎల్లప్పుడూ మీ వంటగదికి ఆగ్నేయ మూలలో అంటే ఆగ్నేయ దిశలో ఉండాలి. అలాగే ఆహారం చేసేటప్పుడు, మీ ముఖం తూర్పు వైపు ఉండాలి.

చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది హిందూ మతం ప్రకారం, వంటగదిలో చేసిన ఆహార పదార్ధాన్ని ఎల్లప్పుడూ ఆవుకు ఇచ్చే సంప్రదాయం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. మీకు ఆవు దొరకకపోతే ఆ ఆహారాన్ని కుక్కకు కూడా తినిపించవచ్చు. ఆహారానికి సంబంధించిన ఈ రెమెడీని అనుసరించడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పరిహారం చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు.

హిందూ మతంలో ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మొదటగా ఆవుకి పెట్టడం చాలా పుణ్యంగా పరిగణించబడుతుంది, అయితే ఆవుకు నిల్వ ఉన్న ఆహారం లేదా చెడిపోయిన ఆహారాన్ని తినిపించడం గొప్ప పాపంగా పరిగణించబడుతుంది. గోమాతలో సకల దేవతలు ఉంటారని నమ్మకం. కనుక పొరపాటున కూడా ఆవుకు చెడిపోయిన ఆహారాన్ని అందించవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు