Kokum Fruit : వేసవి సూపర్‌ఫ్రూట్ ఇది..! యాంటీ సెప్టిక్‌గా పనిచేసే ఈ పండు ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
ఈ ఎరుపు రంగు, పుల్లని పండు రసం శరీరానికి అద్భుతమైన రిఫ్రెష్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఈ పండును మామూలు పండులా అనుకోకండి..దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. అంతే కాకుండా ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండ్ల రసాన్ని రెగ్యులర్ గా తాగితే శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Kokum Fruit: కోకుమ్ పండు గురించి విన్నారా..? ఆయుర్వేదంలో ఉపయోగించే పండ్లలో ఇది కూడా ఒకటి. కోకుమ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కూల్, మంచి సువాసన కలిగిన ఈ పండు పుష్కలమైన పోషకాల నిధిగా పిలుస్తారు. కోకుమ్ పండు నుండి తీసిన జ్యూస్ ఒక గొప్ప యాంటీఆక్సిడెంట్‌తో కూడి ఉంటుంది. దీనిని గార్సినియా ఇండికా అని కూడా అంటారు. ఈ ఎరుపు రంగు, పుల్లని పండు రసం శరీరానికి అద్భుతమైన రిఫ్రెష్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఈ పండును మామూలు పండులా అనుకోకండి..దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. అంతే కాకుండా ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండ్ల రసాన్ని రెగ్యులర్ గా తాగితే శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మీరు తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటే, మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, గోకం పండు తినండి. ఎందుకంటే ఈ పండులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
డయేరియా సమస్య: మీకు డయేరియా సమస్య ఉంటే కోకుమ్ తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ డయేరియా గుణాలు ఉన్నాయి. డయేరియాతో బాధపడేవారికి కోకుమ్ పండు రసం వరంలాంటిది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: కోకుమ్ జీవక్రియను పెంచుతుంది. ఈ కోకుమ్ పండులో క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి, దీన్ని తినడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే ఈ జీరో క్యాలరీ ద్రవంతో పాటు మనకు కొన్నిసార్లు మరింత పోషకమైనవి అవసరం అవుతాయి.
బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతుంది: కోకుమ్ పండ్ల రసం రక్తంలో చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండుతో చేసిన జ్యూస్‌ని క్రమం తప్పకుండా తాగాలి.
గుండె ఆరోగ్యానికి: కోకుమ్ పండు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. నిజానికి, ఈ పండులో విటమిన్లు, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడంలో గొప్పగా సహాయపడతాయి.
చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది: అత్యంత ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్ కలిగిన కోకుమ్ ..వృద్ధాప్య లక్షణాలను తగ్గించే చికిత్సలలో తప్పకుండా ఉపయోగించబడుతుంది. ఇది చర్మాన్ని మరమ్మత్తు, నయం చేయడమే కాకుండా చర్మ కణజాల నష్టాన్ని ఎదుర్కోవటానికి కూడా సహాయపడుతుంది.
ఋతుస్రావంలో సహాయపడుతుంది: కోకుమ్ ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సంక్లిష్టమైన రుతుక్రమ పరిస్థితులను సులభతరం చేస్తుంది. అయితే, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు మంచిదికాదు. అలాగే, ముఖ్యమైన చర్మ అలెర్జీలు ఉన్న వ్యక్తులు దానిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)