AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger : అయ్యో పాపం..! అర్ధరాత్రి హైవేపై పులిని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్‌

ఈ వీడియోలో గాయపడిన పులి రోడ్డుపై నుంచి అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం హృదయవిదారకంగా కనిపించింది. తీవ్ర గాయాలు కావడం వల్ల అది పడుతూ లేస్తూ ముందుకు కదిలింది. దాన్ని ఆ పరిస్థితుల్లో చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tiger : అయ్యో పాపం..! అర్ధరాత్రి హైవేపై పులిని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్‌
Tiger Hit By Speeding Car
Jyothi Gadda
|

Updated on: May 22, 2024 | 8:36 PM

Share

మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై దారుణ ఘటన చోటుచేసుకుంది. నావెగావ్‌ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులి తీవ్రంగా గాయపడింది. దాని ముందు కాళ్లు రెండు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఆ పులి బాధతో విలవిల్లాడుతూ.. వెనక కాళ్లతోనే రోడ్డుపై ఈడ్చుకుంటూ ఆ పక్కనున్న పొదల్లోకి వెళ్లి పడిపోయింది. చివరకు మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ వెనకాలే మరో కారులో వస్తున్న ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని వీడియో తీసి తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశాడు. గాయపడ్డ పులిని కాపాడేందుకు నాగ్‌ పూర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూసిందని పేర్కొన్నాడు.

కేవలం 19 సెకన్ల ఈ వీడియో చాలా బాధాకరం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది X యొక్క హ్యాండిల్ @Prateek34381357లో షేర్‌ చేయబడింది. ఈ వీడియోలో గాయపడిన పులి రోడ్డుపై నుంచి అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం హృదయవిదారకంగా కనిపించింది. తీవ్ర గాయాలు కావడం వల్ల అది పడుతూ లేస్తూ ముందుకు కదిలింది. దాన్ని ఆ పరిస్థితుల్లో చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన మహారాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగించింది. రోడ్డు దాటుతున్న వన్యప్రాణులను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
తెలుగునేలపై అరుదైన జాతి పాము.. బొమ్మలా నటిస్తూ.. దగ్గరకెళ్లగా..
తెలుగునేలపై అరుదైన జాతి పాము.. బొమ్మలా నటిస్తూ.. దగ్గరకెళ్లగా..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ
కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!