AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Post: స్కూల్ వదిలేస్తాను- కానీ జుట్టు కత్తిరించుకోను..బాలుడి వింత పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళన..కారణం ఏంటంటే..

ఇప్పుడు అతనికి పాఠశాల నుండి కూడా పంపిస్తారేమో అని భయం పట్టుకుంది. దాంతో తమ బిడ్డను ఎక్కడ చదివించాలో అర్థం కావడం లేదంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే, ఫరూక్ తన జుట్టు కారణంగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 లక్షల మందికి పైగా ఫరూక్‌ని వీక్షించారు.

Viral Post: స్కూల్ వదిలేస్తాను- కానీ జుట్టు కత్తిరించుకోను..బాలుడి వింత పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళన..కారణం ఏంటంటే..
Farouk James
Jyothi Gadda
|

Updated on: May 22, 2024 | 9:21 PM

Share

మనం ఎక్కడ నివసిస్తున్నామో ఆ పరిసరాలకు అనుగుణంగా జీవించాలి. ఎందుకంటే, ఆయా ప్రాంతాలు, పరిసరాలను బట్టి  దాని స్వంత నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు స్కూల్‌కు వెళుతున్నట్లయితే వారు ఆ స్కూల్‌ రూల్స్‌ పాటించాలి. పిల్లలు అలా చేయకపోతే తగిన శిక్ష ఉంటుంది. అలాంటి స్కూల్‌ రూల్స్‌ పట్టించుకోలేదనే కారణంగా ఓ పిల్లవాడిని స్కూల్‌ శిక్షించింది. అందుకు సంబంధించి కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ చిన్నారి కథ వైరల్ అవుతోంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పిల్లవాడి జుట్టు చాలా పొడవుగా ఉంది. అతడి అవతారం కారణంగా స్కూల్‌ డిసిప్లేన్ పాడుచేస్తుందని పాఠశాల నుండి బహిష్కరించారు. పిల్లవాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పినప్పటికీ స్కూల్‌ యజమాన్యం దీనిని వ్యాధిగా అంగీకరించడానికి సిద్ధంగా లేవు. ఆ విద్యార్థి 12 ఏళ్ల ఫరూక్ జేమ్స్. అతని జుట్టు మొత్తం అమ్మాయిలా కనిపిస్తుంది. అతనికి సమస్యగా మారింది. ఈ జుట్టు చాలా పెద్దగా ఉండటం వల్ల స్కూల్ యజామాన్యం నిరాకరించింది. కానీ, ఆ తల్లిదండ్రులు బాలుడి జుట్టును ఎందుకు కత్తిరించరు అనే ప్రశ్న సందేహం మీ మనస్సులో కూడా తలెత్తవచ్చు. దీని వెనుక తీవ్రమైన కారణం కూడా ఉంది.

జుట్టు కట్‌ చేస్తే ఫరూక్‌కు పట్టలేని భయం. దీని వెనుక తీవ్రమైన కారణం కూడా ఉంది. ఈ విషయమై ఫరూఖ్ తల్లి మాట్లాడుతూ.. డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం ఫరూఖ్‌ టాన్సురేఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దాంతో రోగి జుట్టు కత్తిరించుకోవాలంటే చాలా భయపడే పరిస్థితి నెలకొంది. పిల్లల తల్లిదండ్రులు ఈ భయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ ప్రపంచం అర్థం చేసుకోదు. దీనిపై పాఠశాల యాజమన్యం మాత్రం ఇది వ్యాధి కాదని సాకుగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

తన బిడ్డ భయాన్ని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుకు జుట్టు అల్లి జడవేసి స్కూల్‌కి పంపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే పాఠశాల దీనికి అనుమతించలేదు. జుట్టు వల్ల అతను చాలాసార్లు పనిష్మెంట్‌కు గురయ్యాడు. ఇప్పుడు అతనికి పాఠశాల నుండి కూడా పంపిస్తారేమో అని భయం పట్టుకుంది. దాంతో తమ బిడ్డను ఎక్కడ చదివించాలో అర్థం కావడం లేదంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే, ఫరూక్ తన జుట్టు కారణంగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 లక్షల మందికి పైగా ఫరూక్‌ని వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..