AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pappu chaiwala: నెట్టింట దుమ్మురేపుతున్న మరో చాయ్​స్టార్.. టీ తయారీ చూస్తే వావ్‌ అనాల్సిందే.. వీడియో ఇదిగో..!

వీడియోకి ఏకంగా 42 మిలియన్ల వ్యూస్, లక్షల కొద్దీ లైకులు వచ్చాయి. అంతేకాదు.. పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. ఈ చాయ్ వాలా బిల్ గేట్స్ ను కలవాలని అనుకుంటున్నాడు అని కొందరు. ఈసారి ఏకంగా ఎలన్ మస్క్ వచ్చి టీ తాగుతాడులే అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Pappu chaiwala: నెట్టింట దుమ్మురేపుతున్న మరో చాయ్​స్టార్.. టీ తయారీ చూస్తే వావ్‌ అనాల్సిందే.. వీడియో ఇదిగో..!
Pappu Chaiwala
Jyothi Gadda
|

Updated on: May 22, 2024 | 9:01 PM

Share

కొన్ని రోజుల క్రితం బిల్‌గేట్స్‌కి టీ అందించి రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిన డాలీ చాయ్ వాలా సోషల్ మీడియాలో చాలా పాపులర్. డాలీ చాయ్‌వాలా వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇండియాకు వచ్చినప్పుడు.. ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్లి చాయ్ తాగడం కూడా వైరల్ గా మారింది. అలాంటి మరో చాయ్ వాలా ఇప్పుడు తెరపైకి వచ్చాడు. గుజరాత్ లోని సూరత్‌కు చెందిన పప్పు చాయ్‌వాలా వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డాలీ చాయ్‌ వాలాకు ధీటుగా ఉంటోంది.

గుజరాత్ లోని సూరత్ లో న్యూసిటీ లైట్ రోడ్ ప్రాంతంలో ఈ పప్పూ చాయ్ వాలా దుకాణం ఉంది. పప్పుచాయ్‌ వాలా టీ పెడుతున్న విధానం ఎంతో స్టైల్‌గా కనిపిస్తుంది. అతను పాల ప్యాకెట్లను పైకి ఎగరేస్తూ పట్టుకోవడం.. పాలను ఎత్తు నుంచి గిన్నెలో పోయడం వంటివి మరో యాక్షన్ చాయ్ వాలా అన్న పేరు తెచ్చాయి. ఇతడు తయారు చేసిన టీ మరీ స్పెషల్ గా కనిపిస్తోంది. పాలల్లో పుదీనా, లెమన్ గ్రాస్ వంటి ఆకులు, అల్లం, టీ పొడి వంటివన్నీ వేసి మరగబెట్టాడు. అందులో చక్కెర, ఇతర పదార్థాలు వేశాడు. చివరికి అవన్నీ వడగట్టి.. టీ సిద్ధం చేశాడు. ఇదంతా పక్కనే ఉన్న వారు వీడియోలు తీశారు. అది ఇన్ స్టాలో పోస్టు చేయటంతో పప్పుచాయ్‌వాల స్టైల్‌ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు ఎంతగానో లైక్‌ చేస్తున్నారు. వీడియోకి ఏకంగా 42 మిలియన్ల వ్యూస్, లక్షల కొద్దీ లైకులు వచ్చాయి. అంతేకాదు.. పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. ఈ చాయ్ వాలా బిల్ గేట్స్ ను కలవాలని అనుకుంటున్నాడు అని కొందరు. ఈసారి ఏకంగా ఎలన్ మస్క్ వచ్చి టీ తాగుతాడులే అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ