Fire Breaks Out : కెమికల్‌ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. బాయిల‌ర్ పేలి ఎగిసిప‌డిన మంట‌లు.. డిప్యూటీ సీఎం ట్విట్‌..!

అయితే ఈ పేలుడు కారణంగా మంటల్లో పలువురికి గాయాలు కాగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కర్మాగారంలో మండుతున్న భారీ మంటలు దూరం నుండి కూడా భయానకంగా కనిపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, 30 మంది గాయపడినట్టుగా తెలిసింది.

Fire Breaks Out : కెమికల్‌ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. బాయిల‌ర్ పేలి ఎగిసిప‌డిన మంట‌లు.. డిప్యూటీ సీఎం ట్విట్‌..!
Fire Breaks Out
Follow us

|

Updated on: May 23, 2024 | 6:45 PM

మహారాష్ట్రలోని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డొంబివ్లి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. థానే స‌మీపంలోని డొంబ్లివిలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఫ్యాక్ట‌రీలో గురువారం మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ప్రమాదంతో క్షణాల్లో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ వ్యాపించింది. అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. కర్మాగారంలో మండుతున్న భారీ మంటలు దూరం నుండి కూడా భయానకంగా కనిపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, 30 మంది గాయపడినట్టుగా తెలిసింది. ఫ్యాక్ట‌రీలోని ఓ బాయిల‌ర్‌లో పేలుడు కార‌ణంగా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని సమాచారం. ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్న నాలుగు అగ్నిమాప‌క యంత్రాలు మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

సమాచారం మేరకు డొంబివ్లి ప్రాంతంలోని అంబర్ కెమికల్ కంపెనీకి చెందిన నాలుగు బాయిలర్లు పేలడంతో అగ్నిప్రమాదం జరిగిందని తెలిసింది. మంటల వేడికి అక్కడ ఉన్న రసాయనాలతో నిండిన డ్రమ్ములు పగిలిపోవడంతో ఫ్యాక్టరీ అద్దాలు పగిలిపోయాయి. మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించడంతో వారికి కూడా నష్టం వాటిల్లింది. సంఘటనా స్థలానికి అగ్నిమాపక దళాన్ని రప్పించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పేలుడు కారణంగా మంటల్లో పలువురికి గాయాలు కాగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ మంత్రి రవీంద్ర చవాన్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయపడవద్దని కోరారు.

మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని సస్పెండ్ చేసినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు మరిన్ని అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రాధ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం ఈ దుర్ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెలుగుచూస్తాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles